Begin typing your search above and press return to search.
ఉగ్రవాదుల జాబితా నుండి ఆ వ్యాపారి పేరు తొలగింపు...ఎవరంటే?
By: Tupaki Desk | 16 Nov 2020 9:30 AM GMTమోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల జాబితాలో ప్రముఖ వ్యాపారవేత్త పేరును చేర్చిన ఎన్ ఐఏ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ఉగ్రవాదుల జాబితా నుంచి అతడి పేరు, ఫొటోను వెబ్ సైట్ నుంచి తొలగించింది. జార్ఖండ్ హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అయితే , ఆ వ్యాపార వేత్త పై నమోదు చేసిన అభియోగాలు మాత్రం సరైన వేనని స్పష్టం చేసింది. అసలు ఏం జరిగిందంటే.. బొగ్గు వ్యాపారం, స్టీల్ ప్లాంట్లు కలిగి ఉన్న అధునిక్ గ్రూప్ అధినేత మహేష్ అగర్వాల్ జార్ఖండ్ లో బొగ్గు ఆధారిత పవర్ ప్లాంటును నిర్వహిస్తున్నాడు.
ఈ క్రమంలో తన వ్యాపార కార్యకలాపాలు సజావుగా సాగేందుకు వీలుగా స్థానిక మావోయిస్టు సంస్థ తృతీయ ప్రస్తుతి కమిటీకి అతడు నిధులు సమకూరుస్తున్నట్లు ఎన్ ఐఏ చార్జిషీట్ దాఖలు చేసింది. 2016 నాటి కేసు కు సంబంధించి ఈ ఏడాది జనవరి 10న ఈ మేరకు అభియోగాలు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో రాంచిలోని ఎన్ ఐఏ ప్రత్యేక న్యాయస్థానం మహేష్ కు వ్యతిరేకంగా నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. జనవరి 17 నాటి ఈ ఆదేశాల తర్వాత ఎన్ ఐఏ తన వెబ్ సైట్ లో మహేష్ అగర్వాల్ ను మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదిగా పేర్కొంటూ అతడి ఫొటోను అప్ లోడ్ చేయడం ఇప్పుడు పలు చర్చలకు దారితీస్తుంది.
ఈ విషయంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ అగర్వాల్ తరఫు న్యాయవాది నితీశ్ రానా జార్ఖండ్ హైకోర్టును ఆశ్రయించారు. నా క్లైంట్ ను అనవసరంగా ఇరికించారు. నిజానికి తను ఈ కేసులో కీలక సాక్షి. ఈ విషయాన్ని ఎన్ ఐఏ కూడా ధ్రువీకరించింది. 2019లో ప్రత్యేక న్యాయస్థానంలో సీఆర్ పీసీ 164 కింద మహేష్ ను సాక్షిగా పేర్కొంటూ స్టేట్ మెంట్ కూడా ఇచ్చింది. కానీ అకస్మాత్తుగా ఆయనను నిందితుడిగా పేర్కొనడం ఆశ్చర్యం కలిగించింది. అంతేకాదు ఎఫ్ ఐ ఆర్ లో ఆయన పేరు లేనప్పటికి తీవ్రమైన అభియోగాలు నమోదు చేసింది. అంతేకాదు ఉగ్రవాదుల జాబితాలో ఆయన పేరు, ఫొటోను ఉంచి ప్రతిష్టకు భంగం కలిగేలా వ్యవహరించింది అని తెలిపారు. దీంతో హైకోర్టు ఆదేశాల మేరకు అక్టోబరు 21న మహేష్ అగర్వాల్ పేరును ఉగ్రజాబితా నుంచి తొలగించిన ఎన్ ఐఏ, అభియోగాలను మాత్రం యథాతథంగా ఉంచినట్లు నవంబరు 3న దాఖలు చేసిన అఫిడవిట్ లో పొందుపరిచింది.