Begin typing your search above and press return to search.
ప్రాణం తీసిన పబ్జీ...సూసైడ్ చేసుకున్న డిగ్రీ స్టూడెంట్ !
By: Tupaki Desk | 2 Dec 2020 4:41 AM GMTకొన్ని కొన్ని సార్లు టైమ్ పాస్ కోసం మనం ఆడే, ఆన్ లైన్ గేమ్స్ వ్యసనంగా మారి లేనిపోని సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు కొందరు యువత. ఇప్పుడు ఎలా వుందంటే, ఆన్లైన్ గేమ్ లకు అడిక్ట్ అవడం, గేమ్ ఆడుతున్న సమయంలో ఎవరినీ పట్టించుకోకపోవడం. మరీ ఈ పబ్జీ గేమ్ అయితే గేమ్ నుంచి పక్కకు చూస్తే గేమ్ లో శత్రువులు మన మీద దాడి చేసి చంపేస్తారనే భయంతో పరిసరాలను సైతం మరిచిపోయి ఆటలో లీనమైపోతుంటారు. ఎంతా అడిక్ట్ అంటే, ఫోన్ చేసినా ఎత్తరు, పిలిచినా పట్టించుకోరు. బలవంతంగా మాట్లడిస్తే అసహనం ప్రదర్శిస్తారు. కొన్ని సందర్భాల్లో అయితే కోపంలో ఏం చేస్తున్నారో కూడా తెలియకుండా ప్రవర్తిస్తారు. తల్లిదండ్రులు ఏదో అన్నారని క్షణికావేశంలో కొందరు ప్రాణాలు తీసుకుంటుంటే.. పబ్జీకి పూర్తి బానిసలుగా మరిన కొందరు లక్షలు పోగొట్టుకుని ప్రాణాలని బలవంతంగా తీసుకుంటున్నారు.
తాజాగా చిత్తూరు జిల్లాలో పబ్జీ గేమ్ ఓ యువకుడి ప్రాణం తీసింది. పబ్‌జీ గేమ్ కోసం లక్షల్లో అప్పులు చేసిన డిగ్రీ స్టూడెంట్ యోగేశ్ , ఆ అప్పు ను ఎలా తీర్చాలో తెలియక , చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు. వెదురుకుప్పం మండలం పచ్చికాపల్లం గ్రామానికి చెందిన యోగేశ్, గత కొన్ని రోజులుగా పబ్జీ గేమ్ కి బానిస అయిపోయాడు. రోజంతా పబ్‌జీ గేమ్ ఆడుకుంటూ కూర్చునేవాడు. ఈ క్రమంలో పబ్ జీ కోసం తల్లిదండ్రుల నుంచి పెద్దమొత్తంలో డబ్బులు తీసుకున్నాడు. అవిసరిపోక స్నేహితులతో పాటు ఊళ్లో తెలిసినవాళ్ల దగ్గర కూడా అప్పులు చేశాడు. అప్పులన్నీ కలిపి 2 లక్షలు దాటిపోవడంతో యోగేష్ ఆందోళన చెందాడు. అప్పుల విషయం తల్లిదండ్రులకు తెలిసి నిలదీయడంతో యోగేశ్ భయపడిపోయాడు. చివరకు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. చేతికందిన బిడ్డలు కళ్లముందే పాడు గేమ్స్‌కు బానిసలై ప్రాణాలు కోల్పోతున్నారని తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. చూశారా.. టైమ్ పాస్ కోసం ఆడిన పబ్‌జీ ఎలా ప్రాణాలు తీసేసిందో.