Begin typing your search above and press return to search.

ఇది ఉంటే మీరు త్వరగా ముసలివాళ్లు కారు

By:  Tupaki Desk   |   12 Jun 2023 11:00 PM GMT
ఇది ఉంటే మీరు త్వరగా ముసలివాళ్లు కారు
X
అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. యవ్వనంలో ఉన్న వ్యక్తుల నుంచి... ముసలి వారి వరకు ప్రతి ఒక్కరికీ.. అందంపై మక్కువే. చాలా మంది వయసు మీద పడిపోతుందని తెగ టెన్షన్ పడిపోతుంటారు. తాము అప్పుడే వృద్ధాప్యంలోకి వస్తున్నామని బెంగపడుతుంటారు. కొంత మంది తక్కువ వయసు ఉన్న కానీ.. ఎక్కువ వయసు ఉన్న వారిలా కనిపిస్తారు. వారికి వృద్ధాప్య చాయలు కనిపిస్తూ ఉంటాయి.

అయితే మనవ శరీరంలో టారిన్‌ పరిమాణం తగ్గడం వల్ల కూడా వృద్ధాప్యానికి కారణమని అంటున్నారు. టారిన్ పరిమాణం తగ్గడంతో వృద్ధాప్యం బారిన పడుతామని కొలంబియా విశ్వ విద్యాలయానికి చెందిన విజయ్‌ యాదవ్‌, ఆయన సహచరులు కనుగొన్నారు.

అసలు టారిన్‌ అంటే ఏంటంటే అది ఒక పోషకం. అది పాలు, మాంసం, చేపల్లో లభిస్తుంది. కోతులు, ఎలుకలకు బయటి నుంచి టారిన్‌ ను అందించినప్పుడు వాటి ఆరోగ్యం ఇనుమడించడంతోపాటు వృద్ధాప్యమూ నెమ్మదించినట్లు కనుగొన్నారు.

ఏడాది పాటు టారిన్‌ ను ఇచ్చినప్పుడు ఆడ ఎలుకల్లో 12 శాతం, మగ ఎలుకల్లో 10 శాతం శాతం మేర ఆయుష్షు పెరిగిందట. మానవుల్లో ఇది 7-8 సంవత్సరాలకు సమానం. టారిన్‌ ఇచ్చిన ఆడ ఎలుకల్లో వయసు, రుతు క్రమ సంబంధ బరువు పెరుగుదల తగ్గింది. ఎముకలు, కండరాల బలం పెరిగింది. ఇన్సులిన్‌ నిరోధకత, ఆందోళన తగ్గాయని కొలంబియా విశ్వ విద్యాలయానికి చెందిన వారు కనుగొన్నారు.

శరీరంలో మృత కణాల సంఖ్య, డీఎన్ఏ నష్టం తగ్గాయి. కొన్ని అవయవాలలో మూల కణాల సంఖ్య పెరిగి, గాయాల నుంచి త్వరగా కోలుకునే శక్తి లభించిందని అంటున్నారు. ఎలుకల్లో వెన్ను, కాళ్లలో ఎముకల సాంద్రత పెరిగిందని చెబుతున్నారు. 60 ఏళ్లు పైబడిన 12,000 మంది ఐరోపా వయోజనులను యాదవ్‌ బృందం పరిశీలించగా, వారిలో టారిన్‌ పరిమాణం ఎక్కువగా ఉంటే టైప్‌ -2 మధు మేహం, రక్త పోటు, ఊబ కాయ ముప్పులు తగ్గినట్లు వెల్లడైంది.

వ్యాయామం చేసినపుడు కూడా టారిన్‌ పెరుగుతుందని కనుగొన్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా టారిన్ ఉన్న పదార్థాలు తిని వృద్దాప్యాన్ని తగ్గించుకోండి. వయసును తగ్గించుకోండి .