Begin typing your search above and press return to search.

భారత సైన్యం జీవ కారుణ్యం

By:  Tupaki Desk   |   1 Nov 2015 10:10 AM GMT
భారత సైన్యం జీవ కారుణ్యం
X
బాహుబలి సినిమా అంతర్జాతీయంగా కావాల్సినంత క్రెడిట్ సాధించుకుంది. బాహుబలి గ్రాండ్ నెస్ తో పాటు అందులోని కొన్ని అంశాలు కూడా ప్రజలకు బాగా నచ్చాయి. బాహుబలి సినిమాలో కాలకేయుడితో యుద్ధానికి వెళ్లే ముందు భల్లాలదేవుడు దున్నపోతును బలి ఇవ్వగా అమరేంద్ర బాహుబలి మాత్రం ఆ సంప్రదాయాన్ని పాటించకుండా ఆ జీవికి స్వేచ్ఛ ప్రకటిస్తాడు. యుద్ధం - కుతంత్రాలు - భీకర సన్నివేశాలతో భయంగొల్పే బాహుబలి సినిమాలో ఇలాంటి మానవీయ దృశ్యాలూ ఉన్నాయి. తాజాగా భారత సైన్యం కూడా ఇలాంటి నిర్ణయమే తీసకుందట. యుద్ధానికి వెళ్లేముందు జంతుబలి ఇవ్వడం భారత సైన్యానికీ అలవాటే... ఇక నుంచి ఆ అలవాటుకు ముగింపు పలకాలని నిర్ణయించారట.

యుద్దానికి వెళ్లేముందు విజయాన్ని కోరుకుంటూ దేవతలకు మొక్కుగా జంతువులను బలి ఇచ్చే విధానానికి స్వస్తిపలకాలని భారత రక్షణ మంత్రిత్వ శాఖ భావిస్తుంది. ఇండియన్ ఆర్మీలో గూర్ఖా రెజిమెంటులో ఈ ఆచారాన్ని బాగా ఎక్కువగా పాటిస్తారు. రెజిమెంటుకు కొత్త ఆయుధాలు వచ్చినా... కొత్త సాధన సంపత్తి చేరినా కూడా జంతుబలులు ఇచ్చి వాటిని ఫోర్సులోకి తీసుకొస్తారట. దసరా సందర్భంగానూ దున్నపోతు తలనరికి ఆయుధ పూజ చేస్తారట. ఇక నుంచి దీనికి ముగింపు పలకబోతున్నారు.

దున్నపోతు తలనరికి పూజలు చేయడాన్ని ఆపివేయలని సైన్యానికి ఇప్పటీకే కేంద్రం నుండి ఆదేశాలు అందాయి. మొన్న దసరా సమయంలోనూ అందుకే సైన్యం ఈ పనిచేయలేదు. జంతుబలిని జీవహింసని... ఇలాంటి పూజా విధానానికి ఇక కొనసాగించబోమని.. జంతుబలి లేకుండా పూజలు చేసుకుంటామని రక్షణ శాఖ అధికారులు కూడా చెబుతున్నారు. అయితే.. గోమాంసానికి వ్యతిరేకంగా బీజేపీ పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం కూడా వచ్చి ఉంటుందన్న వాదనా ఉంది. కారణమేదైనా కానీ జంతువుల ప్రాణాలకు మాత్రం ముప్పు తప్పింది.