Begin typing your search above and press return to search.

ఢిల్లీలో ఓటమి..ఐదురాష్ట్రాల్లోనూ బీజేపీకి అదే గతా?

By:  Tupaki Desk   |   4 March 2021 3:12 PM GMT
ఢిల్లీలో ఓటమి..ఐదురాష్ట్రాల్లోనూ బీజేపీకి అదే గతా?
X
ఇంట గెలిచి రచ్చ గెలవమంటారు. ప్రధాని మోడీ, హోంమంత్రి షాలు ఇదే చేశారు.తొలుత తమ సొంత రాష్ట్రం గుజరాత్ లో నాలుగైదు సార్లు సీఎంగా చేసిన నరేంద్రమోడీ దాన్ని సోపానంగా చేసుకొని ఢిల్లీ పీఠాన్ని అధిరోహించాడు. ఇప్పుడు దేశానికి ప్రధానిగా ఏలుతున్నాడు..

అయితే అదే రాజధాని కేంద్రం మాత్రం బీజేపీకి అచ్చిరావడం లేదు. ఇంట గెలిచిన మోడీ రాజధాని కేంద్రంలో మాత్రం గెలుపు రుచి చూడడం లేదు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ అధినేత కేజ్రీవాల్ చేతిలో వరుసగా బీజేపీ ఓడిపోయింది. ఇప్పుడు అక్కడ మున్సిపల్ ఎన్నికల్లోనూ చిత్తూగా ఓడింది. ఈ విషయాన్ని మీడియా ఎక్కడా ప్రస్తావించకపోవడం చర్చనీయాంశమవుతోంది.తాజాగా ఢిల్లీలో జరిగిన ఐదు మున్సిపల్ కార్పొరేషన్ వార్డుల ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వచ్చాయి. ఫిబ్రవరి 28న ఉప ఎన్నిక జరగగా.. ఇటీవల వెలువడిన ఫలితాల్లో అన్నింట్లోనూ బీజేపీ ఓడిపోవడం కమలదళానికి షాకింగ్ గా మారింది.

దీనిపై తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి స్పందించారు. బీజేపీ పతనం ఢిల్లీ నుంచి మొదలైందని.. ఇక గల్లీ దాకా కొనసాగడం ఖాయమని రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు.ఢిల్లీలో బీజేపీ ఓటమి రేపటి ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలకు తొలి సంకేతమని రేవంత్ రెడ్డి అన్నారు.