Begin typing your search above and press return to search.
ఆదోనిలో పరువు హత్య.. కేక్ తీసుకొని ఇంటికి వెళుతుంటే చంపేశారు
By: Tupaki Desk | 1 Jan 2021 3:54 AM GMTతమను కాదని తమకంటే తక్కువ కులం అబ్బాయిని ప్రేమవివాహం చేసుకుందన్న కోపంతో.. దళిత యువకుడ్ని దారుణంగా చంపేసిన వైనం కర్నూలు జిల్లా ఆదోనిలో చోటు చేసుకుంది. కొత్త సంవత్సరం వేళ.. ఆఫీసు నుంచి ఇంటికి బయలుదేరిన అతను కేక్ తీసుకొని వెళుతుండగా.. రోడ్డు మీద అందరూచూస్తుండగానే రాడ్ తో కొట్టి..బండరాయితో అంతమొందించిన వైనం షాకింగ్ గా మారింది.
ఆదోనిలో ఫిజియోథెరపిస్టుగా పని చేస్తున్న 35 ఏల్ల ఆడమ్ స్మిత్ పరువుహత్యకు బలయ్యాడు. హంతకుల్ని స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. పెను సంచలనంగా మారిన ఈ ఉదంతంలోకి వెళితే.. కర్నూలు జిల్లా గురజాలకు చెందిన ఆడమ్ స్మిత్.. తమ గ్రామానికి చెందిన మహేశ్వరిని ప్రేమ వివాహం చేసుకున్నారు. ఎనిమిదేళ్లు ప్రేమించుకున్న వారి విషయం ఇంట్లోని వారికి తెలీదు. 2020 నవంబరులో మహేశ్వరికి ఎంగేజ్ మెంట్ చేశారు.
తమ ప్రేమను దాచిన ఆమె.. బ్యాంక్ కోచింగ్ కోసం నంద్యాలకు వెళుతున్నట్లుగా ఇంట్లో చెప్పి ఆదోని వెళ్లారు. అనంతరం ఆడమ్ స్మిత్ తో కలిసి హైదరాబాద్ కు వెళ్లి.. ఆర్యసమాజ్ లో ప్రేమ వివాహం చేసుకున్నారు. మహేశ్వరి కుటుంబ సభ్యులు ఆడమ్ స్మిత్ కు ఫోన్ చేసి చంపేస్తామని బెదిరంచారు. దీంతో కొత్త జంట కర్నూలు జిల్లా ఎస్పీని కలిసి.. తమకు ప్రాణహాని ఉందని.. రక్షణ కల్పించాలని కోరారు. ఎస్పీ ఆదేశాల మేరకు స్థానిక పోలీసులు మహేశ్వరి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆ సమయంలోనూ మహేశ్వరి ఇంటికి తిరిగి రాకుంటే చనిపోతామంటూ ఎలుకల మందును తీసుకొచ్చి బెదిరించారు.
దీంతో జోక్యం చేసుకున్న పోలీసులు సర్దిచెప్పి.. రాజీ చేశారు. పెళ్లి చేసుకున్న కొత్త జంట.. తమ ఊరికి వస్తే పరువు పోతుందని..రావొద్దని చెప్పారు. ఇందుకు వారు సరేనన్నారు. పోలీసుల కౌన్సిలింగ్ నేపథ్యంలో తమకు ఎలాంటి ఇబ్బంది ఉండదన్న ఉద్దేశంతో ఆదోనిలో ఇల్లు తీసుకొని ప్రశాంతంగా గడుపుతున్నారు. అలాంటిది అనూహ్యంగా స్మిత్ ను నడిరోడ్డు మీద అందరూ చూస్తుండగా చంపేసిన వైనం సంచలనంగా మారింది. తన కారణంగా తన భర్తను చంపేయటంతో శోక సంద్రంలోకి జారుకున్న మహేశ్వరి విలపించిన తీరు అందరిని కంటతడి పెట్టేలా చేసింది. తనను క్షమించాలని స్మిత్ తండ్రి కాళ్ల మీద పడిన వైనం అందరిని కదిలేలా చేసింది.
తన భర్తను తన తండ్రి.. పెద్దనాన్న చంపించారని పోలీసులకు మహేశ్వరి కంప్లైంట్ చేశారు. తక్కువ కులం అనే తన కొడుకును చంపేశారంటూ స్మిత్ తండ్రి ఆరోపించారు. కొత్త సంవత్సరం వేడుకల్ని ఘనంగా జరుపుకోవాలని ఇంటికి కేకు తీసుకెళుతూ.. హత్యకు గురైన వైనం జిల్లావ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.