Begin typing your search above and press return to search.
రాజమండ్రి రూరల్ జాబితాలో దీపిక పదుకొనే ఓటు!
By: Tupaki Desk | 23 March 2019 12:41 PM GMTఓటర్ల జాబితాలో తప్పులు దొర్లడం.. దానిపై జనాలు గగ్గోలు పెట్టడం ప్రతిసారి జరిగేదే. చనిపోయిన వారికి.. అసలు జన్మలో నియోజకవర్గం మొహం చూసి ఎరగని వారికి.. ఆఖరికి దేవుళ్ళకు కూడా ఒక్కోసారి ఓటరు జాబితాలో పేరు ఉండడం అప్పుడప్పుడూ జరుగుతుంది. ఇలాంటి వార్తలను మనం ఎన్నోసార్లు మనం చూసే ఉంటాం. ఈసారి అలాంటి సంఘటనే రాజమండ్రిలో జరిగింది.
ఈ ఓటు మామూలు ఓటు కాదు మహా ఓటు. ఎందుకంటే.. ఓటర్ పేరు దీపిక పాదుకొనే. వయసు 22 ఏళ్ళు. ఆవిడ తండ్రి పేరు రమేష్ కొండా. అలవాట్లో పొరపాటే... చేసిన తప్పును సిన్సియర్ గా చేశారా అంటే అదీ లేదు. దీపిక పదుకొనే ఫోటోకు బదులుగా టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ఫోటోను పెట్టారు. ఈ ఓటు ఎక్కడ ఉందంటే రాజమండ్రి రూరల్ జాబితాలో. ఈ ఫోటో సోషల్ మీడియాలో ఇప్పుడు జోరుగా హల్చల్ చేస్తోంది. ఇలాంటి ఎన్నికల జాబితాలు తయారు చేసిన అధికారులపై నెటిజనులు జోకులు పేలుస్తున్నారు.
అసలే ఓటుకు అర్హత ఉన్నవారి పేర్లు మిస్ అయ్యాయని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నారు. ఈ అధికారులేమో అసలు ఓటర్లను వదిలేసి దీపిక.. కాజల్ అగర్వాల్ ఓట్లను రాజమండ్రిలో నమోదు చేస్తున్నారు. ఈ ఫన్నీ ఓటు సంగతి మరి దీపికకు.. కాజల్ అగర్వాల్ కు తెలుసో లేదో.. ఎవరైనా చెప్పండర్రా!