Begin typing your search above and press return to search.

న్యాయవ్యవస్థపై జస్టిస్ దీపక్ గుప్త సంచలన వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   9 May 2020 4:30 PM GMT
న్యాయవ్యవస్థపై జస్టిస్ దీపక్ గుప్త సంచలన వ్యాఖ్యలు
X
సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా రిటైర్ అవుతున్న జస్టిసక్ దీపక్ గుప్తా న్యాయవ్యవస్థపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సుప్రీం కోర్టు జడ్జీలు రిటైర్ మెంట్ అయిన వెంటనే ప్రభుత్వ పదవులు పొందితే వాళ్లు అమ్ముడు పోయారని.. అందుకే పదువులు లభించాయనే సందేహాలు ప్రజల్లో వ్యక్తమవుతాయని అన్నారు. అయోధ్య, త్రిపుల్ తలాక్, జమ్మూకశ్మీర్ విభజన సహా సంచలన తీర్పులు ఇచ్చిన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్ కు బీజేపీ రాజ్యసభ సీటు ఇవ్వడం.. ఆయన స్వీకరించడంపై రాజకీయ పదవి పొందడం వెనుక ఏదో కారణం ఉండి ఉంటుందని ప్రజలు భావిస్తారన్నారు. తప్పో ఒప్పో పక్కనపెడితే సుప్రీం కోర్టు న్యాయమూర్తులు ఇలా రాజకీయ పదవులు పొందడాన్ని తాను సమర్థించనని స్పష్టం చేశారు.

తనకు ఆఫర్ ఇచ్చినా తీసుకోనని.. ఎలాంటి రాజకీయ పదవిని చేపట్టనని జస్టిస్ దీపక్ గుప్తా తెలిపారు. భారత దేశ చరిత్రలో ఇద్దరు ప్రధాన న్యాయమూర్తులు సదాశివం, రంజన్ గొగొయ్ మాత్రమే ఇలా రాజకీయ పదవులు చేపట్టారని దీపక్ గుప్తా తెలిపారు.

దేశ న్యాయవ్యవస్థ సంపన్నులకు, శక్తివంతులకు అనుకూలంగా పనిచేస్తుందని జస్టిస్ దీపక్ గుప్తా మరో సంచలన కామెంట్ చేశారు. ప్రజలు న్యాయ వ్యవస్థను చూసే దృక్పథంలో మార్పు వచ్చిందని తెలిపారు.

సుప్రీం కోర్టు న్యాయమూర్తుల ప్రెస్ మీట్ లో సీజేఐపై లైంగిక వేధింపులు, స్కామ్ కేసులపై న్యాయమూర్తులు చర్చించలేదని జస్టిస్ దీపక్ తెలిపారు.

కాగా అయోధ్య, త్రిపుల్ తలాక్, కశ్మీర్ విభజన సహా కీలక బిల్లుల విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పులు ఇచ్చిన సుప్రీంకోర్టు మాజీ ప్రధానన్యాయమూర్తి రంజన్ గొగొయ్ కు రిటైర్ మెంట్ తర్వాత రాజ్యసభ సీటును బీజేపీ ఇవ్వడంపై జస్టిస్ దీపక్ గుప్తా ఇలా పరోక్ష విమర్శలు చేశారు. ఇదో లోపాయికారి ఒప్పందంలా ప్రజలు భావిస్తారని ఆయన విమర్శించారు.