Begin typing your search above and press return to search.

ఆమెకిచ్చిన బీఎండబ్ల్యూ కారు తీసేసుకున్నారు

By:  Tupaki Desk   |   30 Dec 2016 10:03 AM IST
ఆమెకిచ్చిన బీఎండబ్ల్యూ కారు తీసేసుకున్నారు
X
తన ఆట తీరుతో భారతీయుల మనసుల్లో నిలిచిపోయిన జిమ్నాస్ట్ దీపా కర్మకర్ కారు ముచ్చట తెలిసిందే. మొత్తానికి ఆమె బీఎండబ్ల్యూ కారు కష్టాలు ఒక కొలిక్కి వచ్చాయి. ఒలింపిక్స్ లో ఆమె ప్రదర్శించిన అసాధారణ ఆట తీరు నేపథ్యంలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ చేతుల మీదుగా బీఎండబ్ల్యూ కారును తీసుకోవటం తెలిసిందే.

బహుమతిగా అందుకున్న బీఎండబ్ల్యూ కారు తన పాలిట తెల్లఏనుగ్గా మారిందన్న రీతిలో దీపా కర్మాకర్ చెప్పిన మాటలపై ఆ మధ్య పెద్ద ఎత్తున చర్చ సాగింది. తాను ఉండే అగర్తలలో బీఎండబ్ల్యూ షోరూం లేదని.. ఆ కారుకు తగ్గ రోడ్లు లేవంటూ ఆమె చెప్పి.. ఆ కారును వెనక్కి తీసేసుకొని తనకు డబ్బులు ఇవ్వాల్సిందిగా కోరటం సంచలనంగా మారింది.

చివరకు అక్కడి రాష్ట్ర సర్కారు స్పందించి.. కోట్ల ఖర్చుతో రోడ్లు కూడా వేయించిన పరిస్థితి. అయినప్పటికీ.. తన పరిస్థితికి బీఎండబ్ల్యూ కారు వద్దనుకున్న దీపా మాటకు తగ్గట్లే ఆమెకు ఇచ్చిన బీఎండబ్ల్యూ కారును వెనక్కి తీసేసుకున్నారు. ఆ స్థానే ఆమెకు రూ.25 లక్షలు ఇచ్చారు. బీఎండ్ల్యూ కారును వెనక్కి ఇచ్చేసిన దీపా.. దాని స్థానే హ్యుందాయ్ ఎలెంట్రాను కొనుగోలు చేసింది. దీంతో దీపా.. బీఎండబ్ల్యూ సమస్య ఒక కొలిక్కి వచ్చినట్లే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/