Begin typing your search above and press return to search.

జగన్​, కేసీఆర్​ చాలా సూపర్​ అంట? ఇంతకీ ఎవరన్నారంటే..!

By:  Tupaki Desk   |   1 April 2021 10:30 AM GMT
జగన్​, కేసీఆర్​ చాలా సూపర్​ అంట? ఇంతకీ ఎవరన్నారంటే..!
X
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు అవార్డుల పంట పండింది. వాళ్లు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు ఎంతో అద్భుతంగా ఉన్నాయంటూ ప్రశంసలు దక్కుతున్నాయి. అనేక విభాగాల్లో రెండు రాష్ట్రాలకు అవార్డులు దక్కాయి. కేంద్ర పంచాయతీ రాజ్​శాఖ ’దీన్​దయాళ్​ పంచాయత్​ సశక్తీకరణ్’ ఈ అవార్డులను ప్రకటించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​ కు చెరో 13 అవార్డులు దక్కాయి.

ఏపీలో కొండేపల్లి (ప్రకాశం), గుళ్లపల్లి (గుంటూరు జిల్లా), వర్కూరు (కర్నూలు జిల్లా), పెదలబుడు (విశాఖ జిల్లా), రేణిమాకులపల్లె (చిత్తూరు జిల్లా), తడ కండ్రిగ, తాళ్లపాలెం (నెల్లూరు జిల్లా) గ్రామ పంచాయతీలకు అవార్డులు వచ్చాయి.తెలంగాణలో సుందిళ్ల (పెద్దపల్లి జిల్లా) గ్రామ పంచాయతీ రెండు విభాగాల్లో అవార్డులు కైవసం చేసుకుంది.

పర్లపల్లి (కరీంనగర్ జిల్లా), మిట్టపల్లె, మల్యాల (సిద్ధిపేట జిల్లా), చక్రాపూర్ (మహబూబ్ నగర్ జిల్లా), రుయ్యాండి (ఆదిలాబాద్ జిల్లా), హరిదాస్ నగర్, మోహినీ కుంట (కరీంనగర్ జిల్లా) పంచాయతీలు సైతం అవార్డుల అందుకున్న లిస్టులో ఉన్నాయి. తెలంగాణలో ధర్మారం, కోరుట్ల మండల పరిషత్ లతో పాటు మెదక్ జిల్లా పరిషత్... ఏపీలో అనంతపురం జిల్లా పెనుకొండ, కృష్ణా జిల్లా విజయవాడ రూరల్, తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రూరల్, చిత్తూరు జిల్లా సదుం మండలాలతో పాటు, కృష్ణా, గుంటూరు జిల్లా పరిషత్ కేంద్రం ప్రకటించిన 'దీన్ దయాళ్' అవార్డును అందుకున్నాయి.

అవార్డులు అందుకోవడం పట్ల ఇరు రాష్ట్రాల మంత్రులు, ముఖ్యమంత్రులు సీఎం జగన్​, కేసీఆర్​ హర్షం వ్యక్తం చేశారు. సీఎం జగన్​మోహన్​రెడ్డి పాలనలో ఏపీ పల్లెలు ఎంతో అభివృద్ధి చెందుతున్నాయని.. మంత్రులు పేర్కొన్నారు. నాడు-నేడు కార్యక్రమంతో జగన్​ స్కూళ్ల రూపురేఖలు మార్చారని వారు పేర్కొన్నారు.

పల్లెటూరు పిల్లలు కూడా ఇవాళ అద్భుతమైన ఇంగ్లిష్​లో మాట్లాడుతున్నారంటూ పేర్కొన్నారు. సీఎం జగన్​ కృషిని కేంద్రం గుర్తించిందని పేర్కొన్నారు.మరోవైపు తెలంగాణకు అవార్డులు రావడం పట్ల ఇక్కడి నేతల్లోనూ సంతోషం వ్యక్తమవుతున్నది. సీఎం కేసీఆర్​ ఆధ్వర్యంలోనూ ఎంతో అభివృద్ధి జరుగుతుందని గతంలో ఎన్నడు లేని విధంగా పల్లెప్రగతి అనే ఓ కార్యక్రమం విజయవంతంగా సాగుతుందని వాళ్లు పేర్కొన్నారు.