Begin typing your search above and press return to search.
మోడీకి జనాదరణ తగ్గిపోయిందట..?
By: Tupaki Desk | 18 Jun 2021 11:30 AM GMTచాయ్ వాలాగా.. సామాన్యుడిగా 2014లో ఎంట్రీ ఇచ్చి దేశ ప్రధాని అయ్యారు మోడీ. సంచలన నిర్ణయాలతో దేశంలో తనదైన ముద్రవేసి ఇప్పటికీ బోలెడంత క్రేజ్ సంపాదించుకున్నారు. అయితే కరోనా ఆయన పనితీరును, పాలన తీరును ఎండగట్టిందన్న ఆరోపణలున్నాయి. ప్రజలకు కరోనా వేళ సరైన సాయం చేయలేదన్న అపవాదును మోడీ కూడగట్టుకున్నారు. ఈ క్రమంలో ఓ సర్వే ప్రధాని నరేంద్రమోడీ హవా భారత్ లో తగ్గుతోందని తేల్చింది.
అమెరికాకు చెందిన డేటా ఇంటలిజెన్స్ కంపెనీ 'మార్నింగ్ కన్సల్ట్' తాజాగా ఈ సర్వే నిర్వహించిందట.. 2019తో పోలిస్తే మోడీకి ఉన్న జనామోదం 20 పాయింట్ల మేర తగ్గినట్టు మార్నింగ్ కన్సల్ట్ తెలిపింది.
2019లో మోడీకి 82శాతం జనామోదం ఉండగా.. ఇప్పుడు అది 66 శాతానికి పడిపోయినట్లు తెలిపింది. జమ్మూకాశ్మీర్ విభజన, ఆర్టికల్ 370 రద్దు సమయంలో మోడీ నాయకత్వానికి జనాలు జనామోదం తెలిపారు. ప్రస్తుతం కరోనా పరిస్థితుల్లో మోడీ ఇమేజ్ బాగా దెబ్బతిన్నదని తేలింది.భారత్ లో దాదాపు 2216 మంది అభిప్రాయాలను ఈ సర్వే సేకరించింది. ప్రస్తుతం మోడీ 66శాతం జనామోదంతో టాప్ లో ఉన్నారు. 28శాతం మంది ఆయన నాయకత్వాన్ని తిరస్కరించారని సంస్థ వెల్లడించింది.
భారత్ లో మోడీ జనామోదం తగ్గినప్పటికీ ప్రపంచ దేశాల అధినేతలతో పోల్చి చూస్తే మాత్రం మోడీనే ముందంజలో ఉండడం విశేషంగా మారింది. 66 శాతం జనామోదంతో మోదీ టాప్‌లో ఉండగా... మార్లో ద్రగి(ఇటలీ-65శాతం),లోపెజ్ ఒబ్రేడార్(మెక్సికో-63శాతం),స్కాట్ మారిసన్(ఆస్ట్రేలియా-54శాతం) , ఏంజెలా మెర్కెల్(జర్మనీ-53 శాతం), జస్టిన్ ట్రుడో(కెనడా-48శాతం), బోరిస్ జాన్సన్(యూకె-44శాతం), మూన్ జే ఇన్(సౌత్ కొరియా 37శాతం), పెర్డో సాంచెజ్(స్పెయిన్-36శాతం),ఇమాన్యుయెల్ మాక్రోన్ (ఫ్రాన్స్-35శాతం), యోషిడే సుగా(జపాన్-29శాతం) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
మార్నింగ్ కన్సల్ట్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఎన్నికల సర్వేలు నిర్వహిస్తుంటుంది. దీని అనుబంధ సంస్థ పొలిటికల్ ఇంటలిజెన్స్ యూనిట్ నుంచి రియల్ టైం పోలింగ్ డేటాను సేకరించి విశ్లేషిస్తుంది.
ప్రధానంగా కరోనా వేళ మోడీ వ్యవహరించిన తీరుతోనే దేశంలో మరణ మృదంగం వినిపించిందని.. వ్యాక్సిన్లను వేరే దేశాలకు పంచడం.. దేశంలో కొరత.. సరైన ప్యాకేజీలు ప్రకటించకపోవడం తదితర కరోనా నివారణలో విఫలమైన మోడీ ఈ ర్యాంక్ ను కోల్పోయారని సర్వే సంస్థ తెలిపింది. మోడీ ప్రభ తగ్గడంతో ఇప్పుడు వచ్చే ఏడాది జరిగే 7 రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి గెలుపు ఈజీ కాదని తెలుస్తోంది.