Begin typing your search above and press return to search.
మోడీకి పంచ్ లకు డీసెంట్ గా కౌంటర్ వేసేశాడుగా?
By: Tupaki Desk | 30 Oct 2020 5:45 AM GMTఇప్పుడు రాజకీయాల తీరే వేరు. ఎంత దూకుడుగా వ్యవహరిస్తే అంత గొప్ప అన్నట్లుగా మారింది. తమలపాకుతో నీవొకటిస్తే తలుపు చెక్కతో నేనొకటిస్తా అన్నదిప్పుటి ట్రెండ్ గా మారింది. చిన్నపాటి విమర్శలకు సైతం చెలరేగిపోవటం ఇప్పటి కాలంలో మామూలే. అందుకు భిన్నంగా.. జంగిల్ రాజ్ కా యువరాజ్ అంటే పే.. ద్ద మాటను అన్నప్పటికీ.. పెద్దగా రియాక్టు కాకుండా తెలివిగా కౌంటర్ వేశారు బిహార్ మహాకూటమి సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్. ప్రధాని మోడీ లాంటి నేత నేరుగా తనను అంత పెద్ద మాట అన్నప్పటికీ.. ఆయన్ను ఉద్దేశించి మాత్రం ఒక్క మాట మాట్లాడకుండా డీసెంట్ కౌంటర్ వేసిన వైనం ఆసక్తికరంగా మారింది.
తనను జంగిల్ రాజ్ కా యువరాజ్ అంటూ చేసిన వ్యాఖ్యపై స్పందించిన తేజస్వీ.. అవినీతి.. నిరుద్యోగం.. వలస కార్మికుల సంక్షోభం లాంటి అసలైన సమస్యల్ని ప్రధాని పట్టించుకోకుండా.. అనవసరమైన వ్యాఖ్యలు చేశారంటూ చురుకుగా తగిలే కౌంటర్ ఇవ్వటం గమనార్హం. నరేంద్ర మోడీ దేశానికి ప్రధాని అని.. ఆయన ఏమైనా మాట్లాడొచ్చన్న తేజస్వీ.. తనపై చేసిన వ్యాఖ్యలపై స్పందించాలని అనుకోవటం లేదంటూ కొత్త తరహా ట్రీట్ మెంట్ తో బీజేపీ నేతలకు షాకిచ్చారు.
ఎన్నికల వేళ.. అనవసరమైన దూకుడును ప్రదర్శించకుండా.. మోడీని అట్టే విమర్శలు చేయకుండా.. ఎన్నికల్లో సానుకూల ఫలితం కోసం ప్రయత్నిస్తున్న తేజస్వీ యాదవ్.. బీజేపీ తీరును చిన్న చిన్న ఉదాహరణలతో ఇరుకున పడేలా చేస్తున్నారు. బిహార్ కు వచ్చిన ప్రధాని.. రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యల్ని ప్రస్తావించలేదని.. కీలక అంశాల్ని విస్మరించిందన్నారు.
పేదరికం లాంటివి వారికి కనిపించవు.. కానీ వారి పార్టీ ప్రచారం కోసం మాత్రం ఏకంగా 30 హెలికాఫ్టర్లను వినియోగిస్తారు.. అనవసరమైన అంశాల్ని ప్రస్తావిస్తారని తప్పు పట్టారు. ప్రధాని మోడీ ఎన్ని మాటలు మాట్లాడినా.. రాష్ట్ర ప్రజలకు అన్ని తెలుసంటూ తెలివిగా కౌంటర్ ఇచ్చిన తేజస్వీ.. తనపై ఘాటు విమర్శలు చేసినా డీసెంట్ గా వ్యవహరించారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అనవసరంగా చెలరేగిపోకుండా.. సెటిల్డ్ గా వ్యవహరిస్తున్న ఆయన రానున్న రోజుల్లో బిహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి కానున్నారా? అన్న ప్రశ్నకు సమాధానం ఎన్నికల తీర్పుతోనే తేలుతుందని చెప్పక తప్పదు.