Begin typing your search above and press return to search.

డెక్కన్‌ క్రానికల్‌ వెంకట్రాం రెడ్డి అరెస్ట్‌

By:  Tupaki Desk   |   14 Jun 2023 11:14 AM GMT
డెక్కన్‌ క్రానికల్‌ వెంకట్రాం రెడ్డి అరెస్ట్‌
X
గతకొంతకాలంగా దూకుడు పెంచిన కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్ట రేటు తాజాగా మరో సంచలన కేసు వ్యవహారాన్ని తెరపైకి తెచ్చింది. ఇందులో భాగంగా.. బ్యాంక్ మోసం, మనీలాండరింగ్ కేసులో ఆరోపణల ఎదుర్కొంటున్న డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్ ప్రమోటర్, మాజీ చైర్మన్‌ అయిన వెంకట్రామిరెడ్డి ని ఎన్‌ ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) అరెస్ట్‌ చేసింది!

అవును... కెనరా బ్యాంక్‌, ఐడీబీఏ బ్యాంక్‌ లను మోసం చేసిన కేసులో ఈడీ వెంకట్రాం రెడ్డిని తాజాగా అదుపులోకి తీసుకుంది. దీంతో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. ఇదే సమయంలో ఈయనతో పాటు పీకే అయ్యర్‌, డెక్కన్‌ క్రానికల్‌ ఆడిటర్‌ మణి ఊమెన్‌ ఈడీ అధికారులు అరెస్టు చేశారు.

వీరిని బుధవారం హైదరాబాద్‌ నాంపల్లిలోని మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రత్యేక కోర్టులో హాజరుపరిచిన అనంతరం రిమాండ్‌ కు తరలించనున్నారు.

అయితే వెంకట్రాం రెడ్డిపై ఇలాంటి ఆరోపణలు రావడం ఇది తొలిసారి కాదు. గతంలో కూడా రుణాలు ఎగవేసిన ఆరోపణలతో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) కేసు నమోదు చేసింది. కంపెనీ పేరుమీద తీసుకున్న రుణాలు వ్యక్తిగత ప్రయోజనాలకోసం వినియోగించుకున్నారని ఆరోపణ!

దీంతో... ఈ సీబీఐ కేసు ఆధారంగా వెంకట్రాం రెడ్డిపై ఈడీ కేసు ఫైల్‌ చేసి దర్యాప్తు జరుపుతోంది. గతంలో న్యూఢిల్లీ, హైదరాబాద్, గుర్‌ గావ్, చెన్నై, బెంగళూరులోని రూ.3,300 కోట్లకు పైగా ఆస్తులను ఈడీ అటాచ్‌ చేసిన సంగతి తెలిసిందే. ఆయన పలు బ్యాంకుల్లో రూ.8,800 కోట్ల రుణాలు తీసుకోగా.. వాటిని తిరిగి కట్టకుండా ఎగవేయడంతో ఈడీ దాడులు చేసింది.