Begin typing your search above and press return to search.
వారానికో డెబిట్ కార్డు తింటున్న మనిషి
By: Tupaki Desk | 22 Jun 2023 5:00 AM GMTమీరు చదివింది కరెక్టే. మనిషేంటి.. డెబిట్ కార్డు తినేయటం ఏమిటన్న సందేహం కలగొచ్చు. కానీ.. ఇది నిజం. డెబిట్ కార్డును ఎందుకు తింటారన్న సందేహం రావొచ్చు.ఇక్కడ మా ఉద్దేశం డెబిట్ కార్డు బరువు మేర ప్లాస్టిక్ ను ప్రతి వారం మనిషి తినేస్తున్న వైనాన్ని తాజాగా వెల్లడైన ఒక నివేదిక వెల్లడించింది.కాలం మారింది. పరిస్థితులు మారాయి.
జీవనశైలి మారింది. మనిషి నుంచి విడదీయలేనంతగా ప్లాస్టిక్ తో అనుబంధం పెరిగింది. నిద్ర లేచినంతనే పట్టుకునే మొబైల్ దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ప్రతిది ప్లాస్టిక్ తో సంబంధం ఉన్న వస్తువుల్నే వాడేస్తున్న పరిస్థితి.
ఈ ప్లాస్టిక్ వస్తువుల్ని వాడేస్తున్నప్పుడు మనకు తెలీయకుండానే కొంచెంగా విచ్ఛిన్నం అవుతాయని చెబుతున్నారు. కంటికి కనిపించనంతగా ఉండే ఈ ధూళి.. గాల్లో కలిసి పోతుంటాయి. ఇది 5 మిల్లీమీటర్ల కంటే తక్కువ పరిణామంలో ఉంటుంది.
దీన్ని ప్లాస్టిక్ పార్టికల్ గా పేర్కొంటారు. మరో మాటలో చెప్పాలంటే మైక్రో ప్లాస్టిక్ గా కూడా చెప్పొచ్చు. మన చుట్టూ ఉన్న గాల్లో కలిసి ఉంటే ఈ ప్లాస్టిక్.. మన శ్వాసతో పాటు మనిషి శరీరంలోకి వెళుతుంది.
భూమి మీద ఉన్నగాలి.. నీరు.. మట్టి.. ఇలా అక్కడా ఇక్కడా అన్న తేడా లేకుండా లక్షల టన్నుల మైక్రో ప్లాస్టిక్ పోత పోసినట్లుగా పడి ఉంది. అది రోజురోజుకు పెరగటమే కానీ తగ్గేట్లు లేదు. మనిషి పీల్చే గాలితో శరీరంలోపల తిష్ట వేస్తుంది.
దీని వల్ల విపరీతమైన శ్వాసకోశ సమస్యలు వస్తాయని తాజాగా జరిపిన అధ్యయనంలో తేలింది. 2022 తర్వాత తొలిసారి మనిషి అంతర్గత శ్వాస వ్యవస్థలో ఈ మైక్రో ప్లాస్టిక్ ను గుర్తించారు. తాజాగా వేస్తున్న లెక్క ప్రకారం.. ప్రతి వారం మనిషి పీల్చే గాలి కారణంగా.. శరీరంలోకి ఒక డెబిట్ కార్డు మేర మైక్రోప్లాస్టిక్ వంట్లోకి చేరుతుంది.
దీని కారణంగా ఎలాంటి సమస్యలు ఎదురుకానున్న విషయాన్ని పూర్తి స్థాయిలో అంచనా వేయకున్నా.. ప్రపంచ వ్యాప్తంగా దీనిపై పరిశోధనలు జరుగుతున్నాయి. మనిషి ఆరోగ్యాన్ని డ్యామేజ్ చేసే శక్తి ఈ మైక్రో ప్లాస్టిక్ కు ఉందంటున్నారు. ఇదంతా చదువుతుంటే.. భయం కలుగుతున్నా.. ఆరోగ్యకరమైన వాతావరణంలో గడపాల్సిన అవసరాన్ని తాజా అధ్యయనం గుర్తు చేస్తుందని చెప్పక తప్పదు.