Begin typing your search above and press return to search.

తేలని హనుమాన్ జన్మస్థల వివాదం

By:  Tupaki Desk   |   27 May 2021 4:30 PM GMT
తేలని హనుమాన్ జన్మస్థల వివాదం
X
మన దేవుడైన హనుమంతుడు సంచరించినప్పుడు చూసిన వారు ఎవరూ లేరు. కేవలం గ్రంథాలు, చరిత్రకారుల నుంచి మాత్రమే ఆయన కాలాన్ని మనం తెలుసుకోగలిగాం. ఆధారాలు లేకపోవడం వల్ల.. చాలా మంది పౌరాణిక సంఘటనలు తమ స్థానంలో జరిగాయని భావిస్తారు..

ఇప్పుడు చిరంజీవి అయిన హనుమంతుడి జన్మస్థలంపై వివాదం నెలకొంది.. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు తమ రాష్ట్రంలోనే హనుమంతుడి నిజమైన జన్మస్థలం అని చెప్పుకుంటున్నాయి.. ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానం వేసిన కమిటీ తిరుపతి హనుమంతుడి జన్మస్థలం అని ప్రకటించింది. దీన్ని కర్ణాటక ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. మరో వాదనను తెరపైకి తీసుకొచ్చింది.

తిరుపతి ఏడు కొండలలో ఒకటైన అంజనాద్రి కొండపై హనుమంతుడు జన్మించాడని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేర్కొంది. తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) ఏర్పాటు చేసిన నిపుణుల బృందం ఇదే అంశంపై తన నివేదికను సమర్పించింది. ఈ ప్యానెల్‌లో వేద పండితులు, పురావస్తు శాస్త్రవేత్తలు మరియు ఇస్రో శాస్త్రవేత్త ఉన్నారు. తిరుపతిని హనుమంతుడి జన్మస్థలం అని నిరూపించడానికి తగిన ఆధారాలున్నాయని వారు వాదిస్తున్నారు.

అయితే తాజాగా హనుమాన్ జన్మస్థల వివాదంపై జరిగిన భేటి ఎటూ తేలకుండానే ముగిసింది. టీటీడీ -హనుమ తీర్థ క్షేత్ర ట్రస్ట్ మద్య జరిగిన చర్చ అసంపూర్తిగా ముగిసింది. బహిరంగ చర్చ అని చెప్పి మీడియానైనా అనుమతించకుండా అంతర్గతంగా చర్చ పెట్టారని గోవిందనామ సరస్వతి తెలిపారు.

టీటీడీ చెప్పిన విషయాలు ప్రమాణాలకు అనుగుణంగా లేవని గోవిందనామ తెలిపారు. చర్చలు మంచి వాతావరణంలో జరగలేదన్నారు. టీటీడీ వాదనతో తాను ఏకీభవించలేదని గోవిందానంద వెల్లడించారు.