Begin typing your search above and press return to search.

ట్రంప్, బైడెన్ మధ్య ఈ నెల 15 న జరగాల్సిన డిబేట్ రద్దు!

By:  Tupaki Desk   |   10 Oct 2020 9:50 AM GMT
ట్రంప్, బైడెన్ మధ్య ఈ నెల 15 న జరగాల్సిన డిబేట్ రద్దు!
X
అమెరికాలో ఒకవైపు కరోనా విలయతాండవం చేస్తూ మరోవైపు ఎన్నికల ప్రచారం లో నేతలు హోరెత్తిస్తున్నారు. మరోసారి ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి అధ్యక్షుడి గా భాద్యతలు చేపట్టాలని ట్రంప్ అహర్నిశలు కష్టపడుతున్నారు. మరోవైపు జో బిడెన్ కూడా ట్రంప్ కి గట్టి పోటీనే ఇస్తున్నారు. వీరిద్దరి మధ్య పోటీ చాలా రసవత్తకారంగా సాగుతుంది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా అక్టోబరు 15న ట్రంప్‌, బైడెన్‌ మధ్య రెండో డిబేట్‌ జరగాల్సి ఉండగా అది రద్దు అయింది.

ఇప్పటికే ఈ ఇద్దరు అభ్యర్థులు తొలి డిబేట్ లో పాల్గొన్న విషయం తెలిసిందే. ట్రంప్‌, బైడెన్‌ల మధ్య తొలి డిబేట్ సెప్టెంబరు 29న జరిగింది. రెండో డిబేట్ రద్దు కావడంతో ఇక నేరుగా ఇరువురు మూడో డిబేట్ లో పాల్గొనాల్సి ఉంటుంది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం జరగాల్సిన రెండో డిబేట్ జరగదంటూ ఈ మేరకు కమిషన్ ఆన్ ప్రెసిడెన్షియల్ డిబేట్స్ ప్రకటించింది. అక్టోబర్ 15న జరగాల్సిన డిబేట్ రద్దు కావడంతో ఇక ఇద్దరు అక్టోబర్ 22న జరగాల్సిన డిబేట్ లో పాల్గొననున్నారు. ట్రంప్ కరోనా బారిన పడిన నేపథ్యంలో రెండో డిబేట్ పై ఇటీవల సందిగ్ధత నెలకొన్న సంగతి తెలిసిందే.

ఆ డిబేట్‌ ను వర్చువల్‌ పద్ధతిలో జరపాలన్న కమిషన్‌ ఆన్‌ ప్రెసిడెన్షియల్‌ డిబేట్స్‌ ‌ నిర్ణయాన్ని ట్రంప్‌ ఒప్పుకోలేదు. తాను నేరుగా పాల్గొంటానని చెప్పారు. బైడెన్‌ మాత్రం వర్చువల్‌ డిబేట్‌ కు అంగీకరించారు. అయితే, డిబేట్ లో పాల్గొనే వారి ఆరోగ్యంతో పాటు భద్రతను దృష్టిలో పెట్టుకుని తాము చర్చలను వర్చువల్ పద్ధతిలో నిర్వహించాలనుకున్నామని సీపీడీ తెలిపింది. ఆ డిబేట్‌ వర్చువల్‌ గానే జరుగుతుందని స్పష్టం చేసినప్పటికీ, చివరకు తమ నిర్ణయాన్ని మార్చుకుంది. డిబేట్ ను పూర్తిగా రద్దు చేసినట్లు ప్రకటించింది.