Begin typing your search above and press return to search.
గుజరాత్ ఘోరం.. ఆ ఎంపీ కుటుంబ సభ్యులు 12 మంది బలి!
By: Tupaki Desk | 31 Oct 2022 9:30 AM GMTగుజరాత్‌లోని మోర్బీ పట్టణంలో మచ్చు నదీపై తీగల వంతెన కూలిన ఘటనలో అంతకంతకూ మృతుల సంఖ్య పెరుగుతోంది. ఆదివారం సెలవు కావడంతో దాదాపు 500 మందికిపైగా సందర్శకులు వేలాడే వంతెనపైకి వచ్చారు. 140 ఏళ్ల క్రితం నాటి వంతెన కావడం, ఇటీవల మరమ్మతులు జరిగి ఉండటం, పరిమితికి మించి సందర్శకులను వంతెనపైకి అనుమతించడం వంటి కారణాలతో తీగల వంతెన కుప్పకూలిన సంగతి తెలిసిందే.
ఈ దారుణ ఘటనలో తొలి రోజు 91 మంది మరణించారని వార్తలు రాగా.. రెండో రోజు సోమవారం నాటికి మృతుల సంఖ్య ఏకంగా 132కి చేరింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. మరో వంద మందికి పైగా గల్లంతయ్యారని చెబుతున్నారు. ఎస్‌డీఆర్‌ఎఫ్, ఎన్డీఆర్‌ఎఫ్‌లు సహాయ చర్యలు విస్తృత స్థాయిలో నిర్వహిస్తున్నాయి. ఇప్పటివరకు 177 మందిని రక్షించారు.
కాగా కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనలో బీజేపీ ఎంపీ కుటుంబానికి చెందిన 12 మంది మృతి చెందడం అందరిలో ఆవేదన నింపింది. రాజ్‌కోట్‌కు చెందిన బీజేపీ ఎంపీ మోహన్‌భాయ్ కళ్యాణ్‌జీ కుందారియా సోదరికి చెందిన 12 మంది కుటుంబ సభ్యులు ఈ ప్రమాదంలో మృతి చెందారు.
వంతెన కూలిన దుర్ఘటనలో ఐదుగురు పిల్లలతో సహా తన సోదరి కుటుంబంలోని 12 మంది సభ్యులను కోల్పోయానని బీజేపీ ఎంపీ మోహన్‌భాయ్ కళ్యాణ్‌జీ తెలిపారు.
ప్రమాదం నుంచి బయటపడిన వారికి చికిత్స అందుతోందని మోహన్‌భాయ్ వెల్లడించారు. నదిలో ఉన్నవారి మృతదేహాలను వెలికితీసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. వంతెన కూలిన ఘటనలో పిల్లలు, మహిళలు ఎక్కువగా ఉన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 60 మృతదేహాలను వెలికితీశామని తెలిపారు. తన బంధువులు మరణించడంతో మోహన్‌భాయ్ కళ్యాణ్‌జీ కూడా మోర్బీ పట్టణంలోనే ఉండి సహాయక చర్యల్లో పాలుపంచుకుంటున్నారు.
మరోవైపు ఈ ఘటనను రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. దీనితో సంబంధం ఉన్నవారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హోం మంత్రి షర్‌ష సంఘ్వీ తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేసేందుకు ఐదుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్)ను ఏర్పాటు చేశారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.