Begin typing your search above and press return to search.

వామ్మో.. కరోనా కారణంగా అన్ని మరణాలా.. కేంద్రం ఏం అంటోంది?

By:  Tupaki Desk   |   6 May 2022 5:30 AM GMT
వామ్మో.. కరోనా కారణంగా అన్ని మరణాలా.. కేంద్రం ఏం అంటోంది?
X
చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి కారణంగా ఎన్నో లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే మన దేశంలోనే రెండేళ్లలో అంటే జనవరి 2020 నుంచి డిసెంబర్ 2021 మధ్యలోనే 47 లక్షల మంది చనిపోయారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రకటించింది. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన నివేదికపై భారత దేశం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ రెండేళ్ల కాలంలో దేశంలో సుమారు 5 లక్షల 20 వేల మరణాలు నమోదయ్యాయని అధికారిక గణాంకాలు తెలుపుతున్నాయి.

కానీ ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిన కరోనా మరణాలపై లెక్కలు.. అధికారిక గణాంకాల కంటే 10 రెట్లు ఎక్కవట. అంతే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు మూడవ వంతు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ నివేదిక కోసం ఉపయోగించిన నమూనాల చెల్లుబాటు పటిష్టత, డేటా సేకరణ, పద్దతి సందేహాస్పదంగా ఉందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికపై భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది.

భారత దేశ ఆందోళనలను పరిగణలోకి తీసుకోకుండా.. పరిష్కరించకుండా ప్రపంచ ఆరోగ్య సంస్థ అదనపు మరణాల అంచనాలను విడుదల చేసిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. గణాంకాలు అసంబద్ద మైనవని, శాస్త్రీయంగా సందేహాస్పదమైనదని తెలిపింది. అలాగే దేశంలో జనన, మరణాల నమోదుకు అత్యంత బలమైన వ్యవస్థ ఉందని స్పష్టం చేసింది. డబ్ల్యూహెచ్ఓ డేటా సేకరణ వ్యవస్థను ప్రశ్నించింది. అసంబద్ధంగా ఉన్న ఈ గణాంకాల శాస్త్రీయతపై అనుమానాలు వ్యక్తం చేసింది.

కరోనా కారణంగా చాలా మంది చనిపోయిన మాట వాస్తవమే అయినప్పటికీ... మరీ ఇంత పెద్ద మొత్తంలో చనిపోలేదని వివరించింది. అలాగే ఫస్ట్ వేవ్ అప్పుడే ఎక్కువ మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారని స్పష్టం చేసింది. ఆ తర్వాత కరోనా మరణాల సంఖ్య చాలా వరకూ తగ్గుతూ వచ్చిందని... కరోనా సోకినప్పటికీ దానిని నుంచి బయట పడ్డవారే ఎక్కువని వివరించింది. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతున్నట్లుగా అన్ని మరణాలు లేవంటూ మరసారి వ్యాఖ్యానించింది.

అలాగే చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా ప్రజలంతా అల్లాడిపోతున్నారని తెలిపింది. కానీ మరణాల రేటు చాలా తక్కువగ ఉంటుందని స్పష్టం చేసింది. కరోనా రెండు డోసుల టీకాలతో పాటు బూస్టర్ డోసులు ఇవ్వడం, లాక్ డౌన్ లు విధిస్తూ... ప్రత్యేక చర్యలు తీసుకోవడం వల్లే మరణాల రేటును తగ్గించగలిగామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా ఇవే పరిస్థితులు కొనసాగుతున్నాయని తెలిపింది.