Begin typing your search above and press return to search.

డెత్ ‘విండో’.. రష్యన్ల మిస్టరీ మరణాలు..!

By:  Tupaki Desk   |   28 Dec 2022 12:30 PM GMT
డెత్ ‘విండో’.. రష్యన్ల మిస్టరీ మరణాలు..!
X
రష్యాలోని ప్రముఖులు.. సంపన్నులు.. రాజకీయ నాయకులు ఇటీవలి కాలంలో వరుసగా ఆత్మహత్యలకు పాల్పడుతుండటం మిస్టరీగా మారింది. ఇటీవల భారత్ లోని ఒడిశా రాష్ట్రంలోని ఓ హోటల్ లో నలుగురు రష్యన్ టూరిస్టులు దిగారు. ఇందులో రష్యాకు చెందిన  వ్యాపారవేత్త.. ఎంపీ ఆంటోవ్ ఆ హోటల్ కిటికీ నుండి దూకి ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది.

2018 ఫోర్బ్స్ జాబితాలో ఆంటోవ్ టాప్ 100లో ఒకరిగా ఉన్నారు. అదేవిధంగా డిసెంబర్ 24న రష్యా నౌక రంగానికి చెందిన దిగ్గజ వ్యాపారవేత్త అలెగ్జాండర్ బుజెకోవ్ ఒక సబ్ మెరైన్ ఫ్లోటింగ్ ఫంక్షన్లో హఠాన్మరణం చెందారు. కాగా ఈ ఏడాది ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పటికీ నుంచి 19 మంది రష్యన్లు అంతుచిక్కని కారణాలతో ప్రాణాలను కోల్పోవడం చర్చనీయాంశంగా మారింది.

ఇలాంటి ఘటనలు సోవియట్ రష్యా చరిత్రలో క్రెమ్లిన్ కు ఎదురు నిలిచిన సమయంలో చోటు చేసుకున్నాయని పలువురు గుర్తు చేసుకుంటున్నారు. ప్రస్తుతం పుతిన్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో రష్యాలోని పలువురు ప్రముఖులు మిస్టరీగా ప్రాణాలను కోల్పోతుండటం పలు అనుమానాలకు తావిస్తోంది. కాగా ఇందులో ఎక్కువ శాతం కిటికిలోంచి దూకి మరణించిన ఘటనలు ఉండటం గమనార్హం.

ఈ ఏడాదిలో ఆత్మహత్య చేసుకున్న వారిలో చమురు రంగంలోని రెండు కంపెనీలకు చెందిన వారే ఉన్నారని తెలుస్తోంది. ‘గ్యాజ్ ప్రామ్’ కంపెనీ దాని అనుబంధ సంస్థలకు చెందిన టాప్ ఎగ్జిక్యూటివ్ లు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. అలాగే లుక్ ఆయిల్ చైర్మన్ రావిల్ మాగ్నోవ్ ఆస్పత్రిలో అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరి అక్కడ కిటికిలో నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ఉక్రెయిన్ యుద్ధం మొదలైన రెండో రోజే గ్యాజ్ ప్రామ్ యూనిఫైడ్ సెటల్మెంట్ డిప్యూటీ డైరెక్టర్ అలెగ్జాండర్ అనుమానస్పదంగా మృతిచెందారు.  వీరిలో ఎక్కువ శాతం పై నుంచి కిందపడి మరణించినట్లు పొలిటికల్ సైంటస్ట్ యూరేషియా గ్రూప్ అధిపతి ఇయాన్ బ్రెమ్మర్ తన అధ్యయనంలో వెల్లడించారు.

మొత్తం 12మందిలో అత్యధికంగా కాల్చుకొని లేదా కిటికిలోంచి దూకి గానీ.. ఇతర ప్రదేశాల్లో పై నుంచి కింద పడి చనిపోయారని పేర్కొన్నారు. రష్యన్ వ్యాపార వేత్త మరణాలపై వికీపీడియా ప్రత్యేకంగా ఓ పేజీనే సృష్టించిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఈ ఆత్మహత్యలపై వెస్లియన్ యూనివర్సీటీ ప్రొఫెసర్ పీటర్ రూట్ లాండ్ మాట్లాడుతూ ప్రస్తుతం రష్యన్లు చాలా ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని తెలిపారు.

దీనికితోడు ఇటీవల వారి ఆస్తులు.. విలాసవంతమైన నౌకలు.. షేర్లు.. పశ్చిమ దేశాల ఆంక్షల కారణంగా సీజ్ అయ్యాయని గుర్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వీరంతా ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని తెలిపారు. అయితే వీరిలో ఎక్కువ శాతం పుతిన్  వ్యతిరేకుల కావడంతో ఈ ఆత్మహత్యలన్నీ మిస్టరీని తలపిస్తున్నాయి. మరీ ఈ మరణాలకు సంబంధించిన అసలు నిజాలు ఎప్పుడు బయటకు వస్తాయనేది మాత్రం వేచిచూడాల్సిందే..!


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.