Begin typing your search above and press return to search.
ఒడిశా రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య ఇంత భారీగా ఎందుకో తెలిస్తే షాకే
By: Tupaki Desk | 4 Jun 2023 9:28 AM GMTయావత్ దేశం ఉలిక్కిపడిన ఒడిశా రైలు ప్రమాదం ఘటనలో వందలాది మంది ప్రాణాలు కోల్పోవటం తెలిసిందే. అంచనాలకు అందని రీతిలో చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే.. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో ఒక కొత్త చర్చ షురూ అయ్యింది. రైలు ప్రమాదంలో ఇప్పటివరకు రిపోర్టు అయిన దాని ప్రకారం 288 మంది మరణించారు. 56 మంది తీవ్రంగా గాయపడ్డారు. అనధికారికంగా అందుతున్న సమాచారం ప్రకారం రాబోయే రెండు రోజుల్లో మరణాల సంఖ్య 300 దాటినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు. అలా జరగకూడదనే కోరుకుందాం.
ఇంత భారీగా మృతుల సంఖ్య ఎందుకు ఉంది? అన్న ప్రశ్నకు.. మోడీ సర్కారు నిర్ణయమే దీనికి కారణమని చెబుతున్నారు. అదెలా? అంటే.. హౌరా నుంచి చెన్నైకు వెళుతున్న కోరమండల్ ఎక్స్ ప్రెస్ మొయిన్ లైన్ లోకి వెళ్లకుండా లూప్ లైన్ లోకి వెళ్లటం.. అక్కడే ఆగి ఉన్న గూడ్స్ రైలును వేగంగా ఢీ కొనటంతో.. ఇంజిన్.. దాని వెనుక ఉన్న బోగీలు ఎగిరి అవతల ట్రాక్ మీద పడ్డాయి. అదే సమయంలో బెంగళూరు నుంచి వస్తున్న ట్రైన్ మళ్లీ ఈ బోగీల్ని ఢీకొనటంతో ప్రమాద తీవ్రత ఎక్కువైంది.
ఇక్కడే ఇంకో విషయాన్ని చెప్పాలి. కోరమండల్ ఎక్స్ ప్రెస్.. బెంగళూరు నుంచి వస్తున్న రైళ్లు ఒకే సమయంలో ప్రమాదానికి గురైనట్లుగా అంచనా వేస్తున్నారు. అదెలానంటే.. గూడ్స్ రైలును ఢీ కొని.. రైలు బోగీలు గాల్లో లేచి.. పక్కనున్న పట్టాల మీద పడే వేళకు.. బెంగళూరు రైలు అవతల పట్టాల మీద వెళ్లిపోతుందని.. చివరి నాలుగు బోగీలు పట్టాలు తప్పటం చూస్తే.. కోరమండల్ బోగీలు ఎగిరి.. అవతల పట్టాల మీదకు వెళ్లే వేళకు.. చివరి బోగీలు పట్టాలు తప్పటమే దీనికి నిదర్శనంగా చెప్పొచ్చు.
ఇదంతా ఓకే. మోడీ సర్కారు తప్పేంటి? ఆయన ప్రభుత్వం చేసిన పాపం అన్న పెద్ద మాట ఎలా అంటారు? దానికి లాజిక్ ఏమిటి? అని ప్రశ్నించేటోళ్ల ప్రశ్నల విషయానికి వస్తే..గూడ్స్ ను ఢీ కొన్న కోరమండల్ రైలు మొదటి బోగీలు తీవ్రమైన ప్రమాదానికి గురయ్యాయి. ఈ మొదటి బోగీల్లో ఎక్కువగా ఉండేది జనరల్ కంపార్టు మెంట్లు. మోడీ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత.. వివిధ రైళ్లల్లో జనరల్ బోగీలు తగ్గించేయటం.. రిజర్వు కంపార్టు మెంట్ లు పెంచటం తెలిసిందే. దీంతో.. జనరల్ బోగీలు కిక్కిరిసిపోతున్నాయి. మామూలుగా 60-70 మందితో ఉండాల్సిన బోగీల్లో 120-150 మంది వరకు ఉంటున్న దుస్థితి. ఇదే ఎక్కువ మంది ప్రాణాలు పోవటానికి కారణమైంది.
ప్రమాదానికి గురైన బోగీల్లో ఎక్కువగా జనరల్ బోగీలు ఉండటంతో.. వీటిల్లో ప్రయాణికులు అధికంగా ఉండటంతో.. ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా ఉండటం.. ప్రమాదంలో వారు భారీగా చిక్కుకోవటంతో ప్రాణ నష్టం ఎక్కువగా ఉంది. జనరల్ కంపార్టుమెంట్ తో పోలిస్తే.. స్లీపర్ క్లాస్ లో 72 మంది ప్రయాణికులు ఉంటారు. అదే టూ ఏసీ.. ఫస్ట్ ఏసీ అయితే.. ప్రయాణికుల సంఖ్య మరింత తక్కువగా ఉంటారన్నది తెలిసిందే. మోడీ సర్కారు అనుసరిస్తున్న పాలసీలతో జనరల్ బోగీల్లో సామాన్యులు అధికంగా ప్రయాణించే పరిస్థితి. ఒకవేళ.. మోడీ సర్కారు తమ హయాంలో జనరల్ బోగీల్ని పెంచేసి ఉంటే.. బోగీలు ఇంత రద్దీగా ఉండేవి కావు. అదే జరిగి ఉంటే.. ప్రాణ నష్టం ఇంతలా ఉండేది కాదన్న వాదన పలువురి నోట వినిపిస్తోంది. బ్యాడ్ లక్ ఏమంటే.. బెంగళూరు ట్రైన్ లోనూ పట్టాలు తప్పించి చివరి బోగీలే. వాటిల్లోనూ ప్రయాణించేది సామాన్యులే అన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఇప్పుడు చెప్పండి.. మోడీ సర్కారు పాలసీతోనే ప్రాణనష్టం ఎక్కువ జరిగిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.