Begin typing your search above and press return to search.

పాస్టర్ చెప్పిన మాటలు విని ప్రాణాలు తీసుకున్న 200 మంది

By:  Tupaki Desk   |   14 May 2023 2:00 PM GMT
పాస్టర్ చెప్పిన మాటలు విని ప్రాణాలు తీసుకున్న 200 మంది
X
నోటికి వచ్చినట్లు చెప్పే మత ప్రబోధకుల మాటల్ని నమ్మి.. కొందరు అమాయకులుతమ ప్రాణాల్ని తీసుకుంటారు. తాజా ఉదంతం ఆ కోవలోకే వస్తుంది. ఒక పెద్ద చర్చి ఫాదర్ చెప్పాడన్న కారణంగా.. అతను చెప్పినట్లే చేసిన 200 మంది అమాయకులు బలైన షాకింగ్ ఉదంతం బయటకు వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా అందరూ విస్తుపోతున్న ఈ దారుణ ఉదంతం కెన్యాలో చోటు చేసుకుంది. కెన్యాలోని ఒక పెద్ద చర్చి పాస్టర్ కారణంగా 200 మంది చనిపోయారు. షకహోలా అటవీప్రాంతంలో ఇప్పటివరకు 22 డెడ్ బాడీలు బయటపడగా.. మిగిలిన వారి జాడలు కనిపించకపోవటం సంచలనంగా మారింది.

2019లో పాల్ మెకంజీ అనే చర్చి పాస్టర్ అటవీ ప్రాంతంలోని 800 ఎకరాల్లో విస్తరించిన ఒక భూమిని నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. అయితే.. తనను కలిసి భక్తులకు మంచి మాటలు చెబుతున్నట్లు చెప్పి.. వారిని పక్కదారి పట్టించాడు.

తీవ్రమైన ఆకలితో మరణిస్తే.. జీసెస్ ను కలిసే అరుదైన అవకాశాన్ని సొంతం చేసుకుంటారన్న మాటను తన శిష్యులకు చెప్పేవాడు. దీంతో.. అతని మాటల్ని నమ్మిన పలువురు నిరాహార ధీక్షలు చేపట్టారు. దీంతో డజన్ల కొద్దీ భక్తులు ప్రాణాలు పోయిన పరిస్థితి.

ఇదిలా ఉంటే.. చాలామంది ఆహారం తినక.. ఆకలితో చనిపోతే.. మరొకొందరు మాత్రం గొంతు నులవటం ద్వారా బలవన్మరణాలకుపాల్పడి ప్రాణాలు తీసుకుట్లుగా గుర్తించారు. ఇలా మరణించిన వారిని ఆ ప్రాపర్టీలోనే వారిని ఖననం చేయటం గమనార్హం. ఈ విషయం మీద సమాచారం అందుకున్న అధికారులు మెరుపు వేగంతో దాడులు చేశారు.

ఈ క్రమంలో కొన్ని డెడ్ బాడీను గుర్తించారు. మెకంజీతో పాటు ఆయన భార్యను మరో 16 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ మొత్తం ఉదంతంలో మొత్తం 610 మంది బాధితులు కనిపించటం లేదన్న మాట కొత్త కలకలానికి దారి తీసింది. ఇక్కడ బాదితుల్లో చాలామంది నడవలేని పరిస్థితుల్లో ఉన్నట్లు గుర్తించారు.

చర్చిలో పెద్ద వయస్కులే కాదు చిన్నారులు సైతం చనిపోయి ఉండటంతో పాస్టర్ ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేప్తున్నారు. ఈ తరహా దారుణాలు కెన్యా వ్యాప్తంగా ఇంకెక్కడైనా చోటుచేసుకుంటున్నాయా? అన్న అంశంపై తనిఖీలు చేయాలని దేశాధ్యక్షుడు విలియం రూటో ఆదేశాలు జారీ చేశారు.