Begin typing your search above and press return to search.
33 వేలు దాటిన భూకంప మృతులు..!
By: Tupaki Desk | 13 Feb 2023 1:07 PM GMTతుర్కియే.. సిరియా ప్రాంతాల్లో గత సోమవారం తెల్లవారుజామున భారీ భూకంప సంభవించిన సంగతి తెల్సిందే. వరుస భూకంపాలతో సిరియా.. తుర్కియే ప్రాంతాల్లో భారీ భవంతులు నేలకూలాయి. ఈ భారీ దుర్ఘటనలో 2వేల మంది అదే రోజు మృత్యువాతపడగా అనేక మంది గాయాల పడ్డారు. అయితే శిథిలాల కింద వేలాదిమంది చిక్కుకుపోవడంతో సహాయ బృందాలు వారికి బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నాయి.
తుర్కియే.. సిరియాల్లో భూకంపం సంభవించి వారం రోజులు గడుస్తోంది. ఈ నేపథ్యంలోనే మృతుల సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతూ వచ్చింది. తాజా సమాచారం మేరకు భూకంప మృతుల సంఖ్య 33 వేల 179 మంది మరణించగా సుమారు 92 వేల మంది క్షతగాత్రులుగా మారినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే ఇప్పటికే వారం రోజులు గడిచి పోవడంతో శిథిలాల కింద ఇరుక్కున్న వారు ప్రాణాలతో బయట పడే అవకాశాలు తక్కువగా ఉన్నాయి.
ఈ నేపథ్యంలో భూకంప మృతుల సంఖ్య 50 వేలకు పైగా చేరే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కాగా శిథిలాల కింద ఇరుక్కుపోయిన వారి ఆర్తనాదాలతో ఆయా ప్రాంతాలు హృదయ విదారకంగా మారాయి. సహాయక బృందాలు శిథిలాలను తొలగిస్తున్న క్రమంలో కొందరు మృత్యుంజయులుగా తిరిగొస్తున్నారు.
ఈ క్రమంలోనే 101 గంటలకు శిథిలాల కింద చిక్కుకున్న అద్మాన్ మహమ్మద్ అనే వ్యక్తి 17 ఏళ్ల యువకుడు దాహర్తి తాళలేక తన మూత్రనే తాగి ప్రాణాలతో బయటపడ్డాడు. అలాగే అదియామన్ అనే చోట నాలుగేళ్ల చిన్నారి 105 గంటలపాటు శిథిలాల కింద ఇరుక్కుపోయి ప్రాణాలతో బయట పడింది. కిరిఖాన్లో 50 గంటల తర్వాత ఓ మహిళను జర్మనీ బృందం కాపాడింది.
మరోచోట శిథిలాల కింద ఇరుక్కున్న 20 ఏళ్ల విద్యార్థిని వాట్పాప్ కాపాడింది. అలాగే ఓ చోట తల్లి బొడ్డు ఊడకుండా పుట్టిన ఓ చిన్నారిని సహాయ బృందం రక్షించింది. కిర్ ఖాన్ నగరంలో 88 ఏళ్లను బామ్మను తాజాగా తుర్కిష్.. జర్మనీ బృందాలు కాపాడాయి. ఇక భూకంప సమయంలో ఇద్దరు నర్సులు తమ ప్రాణాలకు తెగించి నవజాత శిశువులను కాపాడిన వీడియో తాజాగా నెట్టింట్లో వైరల్ గా మారింది.
మరోవైపు భూకంప ప్రాంతాల్లో భారీ నిర్మాణాలు చేసిన 130 మంది గుత్తేదారులపై తుర్కియే అధికారులు అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. వీరిలో ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. కాగా భూకంప పరిస్థితిని ఆసరా చేసుకుని కొందరు దోపిడీలకు పాల్పడుతుండటంతో ముఠాలను కట్టడి చేయాలని ప్రభుత్వం పోలీసులను ఆదేశించడం శోచనీయంగా మారింది.