Begin typing your search above and press return to search.
ముప్పనపల్లిలో మృత్యుఘోష..! అంతుచిక్కని వ్యాధితో 20 రోజుల్లో ఆరుగురు మృతి!
By: Tupaki Desk | 28 Dec 2020 9:50 AM GMTఉమ్మడి వరంగల్ జిల్లా ఏటూరునాగారం ఏజెన్సీలోని ముప్పనపల్లి గ్రామంలో మృత్యు ఘంటికలు మోగుతున్నాయి. ఏం జరుగుతుందో తెలియక జనాలు బెంబేలెత్తుతున్నారు. ఓ వింత వ్యాధి జనాలను భయపెడుతున్నది. కేవలం గత 20 రోజుల్లోనే అంతుచిక్కని వ్యాధి సోకి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో జనాల్లో ఆందోళన పెరిగింది. ఏజెన్సీ ప్రాంతమైన ముప్పనపల్లిని ఈ వింతవ్యాధి వణికిస్తున్నది. అయితే తమ గ్రామానికి ఏదైనా దుష్టశక్తి ఆవహించి ఉంటుందని అక్కడి ప్రజలు భావిస్తున్నారు.
గత 20 రోజుల్లో ఈ గ్రామానికి చెందిన ఎర్రయ్య, లక్ష్మీనారాయణ, కుమారి, దుర్గమ్మ, రాధిక, రమేష్ అనే వ్యక్తులు చనిపోయారు. వీళ్లకు మొదట కడుపునొప్పి వచ్చింది. ఆ తర్వాత కొంతసేపటికే రక్తం కక్కుకొని చచ్చిపోయారు. అందరూ ఓకే రీతిన చనిపోవడంతో ప్రజల్లో భయం నెలకొన్నది. అయితే వైద్యశాఖ కూడా వెంటనే ఆప్రమత్తమైంది. గ్రామంలో క్యాంప్ నిర్వహించారు. చనిపోయిన వారికి.. గ్రామస్థులకు మలేరియా, కరోనా, టైఫాయిడ్, డెంగ్యూ పరీక్షలు నిర్వహించారు. కానీ ఎలాంటి ఫలితం రాలేదు. ఆ ఆరుగులు ఎలా చనిపోయారో వైద్యులకు కూడా అంతుపట్టడం లేదు.
అయితే గ్రామస్థులు మాత్రం గ్రామాన్ని ఏదన్నా దుష్టశక్తి పట్టిపీడిస్తుందని భావిస్తున్నారు. దీంతో గ్రామంలో యజ్ఞాలు చేయాలని వేదపండితులను సంప్రదించారు. ఆ దిశగా ఏర్పాట్లు కూడా సాగుతున్నాయి. మరోవైపు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఈ గ్రామంపై దృష్టి సారించారు. అంతుచిక్కని వ్యాధి ఏమిటో తెలుసుకొనేందుకు పరీక్షలు చేస్తున్నారు.