Begin typing your search above and press return to search.
కొత్త ట్రెండ్ కు తెర తీసిన అనంతపురం జిల్లాలో సర్పంచ్ డీల్
By: Tupaki Desk | 8 Feb 2021 3:57 AM GMTఏపీలో జరుగుతున్న పంచాయితీ ఎన్నికలు ఎంత పోటాపోటీగా సాగుతున్నాయో తెలిసిందే. పాడు రాజకీయం పుణ్యమా అని రక్తం పంచుకు పుట్టిన అన్నదమ్ములు.. అక్కచెల్లెళ్లు మాత్రమే కాదు.. చివరకు భార్యభర్తల మధ్య కూడా చిచ్చు పెట్టిన వైనాల్ని చాలానే చూసి ఉంటాం. అందుకు భిన్నంగా తాజాగా జరుగుతున్న పంచాయితీ ఎన్నికల సందర్భంగా అనంతపురం జిల్లాలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. సర్పంచ్ ఎన్నికకు సంబంధించి రూపొందించిన రాజీ ఫార్ములా సరికొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టిందని చెప్పాలి. ఇంతకూ ఏం జరిగిందంటే?
అనంతపురం జిల్లా పామిడి మండలంలోని ఒక గ్రామంలో సర్పంచ్ పదవి కోసం అధికార వైఎస్సార్ కాంగ్రెస్.. విపక్ష టీడీపీ మద్దతుదారులు పోటీ పడ్డారు. ఎన్నికల కోసం బరిలోకి దిగితే ఆర్థికంగా చితికిపోతామని భావించారు. ఎన్నికల సందర్భంగా చోటు చేసుకునే రాజకీయం ఊరును రెండుగా చీలుస్తుందని.. గ్రూపులుగా ఏర్పడి గ్రామ వాతావరణం దెబ్బ తింటుందని భావించారు.
గ్రామ పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టారు. ఈ సందర్భంగా సర్పంచ్ పదవి కోసం రెండు పార్టీల నేతలు తమకు కావాలంటే తమకు కావాలని పట్టుబట్టారు. దీంతో.. చివరకు ఒక నిర్ణయానికి వచ్చారు. సర్పంచ్ పదవికి బేరం పెట్టి.. రూ.4.5లక్షలుగా డిసైడ్ చేశారు.
బరిలో నిలిచిన ఇద్దరు అభ్యర్థులు సర్పంచ్ పదవీ కాలమైన ఐదేళ్లను చెరి సగం పంచుకోవాలి. అందుకు ఒక్కొక్కరు ముందుగా రూ.2.25లక్షలు ఊరికి చెల్లించాల్సి ఉంటుంది. ఆ మొత్తాన్ని గ్రామ అభివృద్ధికి ఉపయోగించాలని నిర్ణయించారు. ఈ పంచాయితీతో అప్పటివరకు బద్ధశత్రువులుగా ఉన్న వారు.. కలిసిపోయి సర్పంచ్ పదవిని రెండున్నరేళ్లు పంచుకోవటం సంచలనంగానూ.. చర్చనీయాంశంగా మారింది.