Begin typing your search above and press return to search.

మహా 'ఎన్సీపీ' ట్విస్ట్ : బీజేపీతో శరద్ డీల్ కుదిరిందా ?

By:  Tupaki Desk   |   25 Nov 2019 6:40 AM GMT
మహా ఎన్సీపీ ట్విస్ట్ : బీజేపీతో శరద్ డీల్ కుదిరిందా ?
X
రాజకీయంలో ఏదైనా సాధ్యమే ..ఎప్పుడు , ఎవరు ఏ పార్టీలో ఉంటారో ..ఎప్పుడు ఇంకో పార్టీలోకి జంప్ అవుతారో ఎవ్వరం చెప్పలేం. రాత్రి ఒక పార్టీలో ఉన్నవారు ..తెల్లవారేసరికి పార్టీ జెండా మార్చిన వారు రాజకీయాలలో చాలామంది ఉన్నారు. ఒకసారి అధికారాన్ని అనుభవించాక ..మళ్లీ అధికారం కోసం ఏ పార్టీలోకి వెళ్లడానికైనా సిద్ధపడతారు. ఇక దీనికోసం ఒక్కొక్క రాజకీయ నేత వద్ద ఒక్కో ప్రణాళిక ఉంటుంది. ఎటువంటి పరిస్థితిని అయిన తమకి అనుకలంగా మార్చుకోగలిగిన వారిలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఒక్కరు.

రాజకీయాల్లో శరద్ పవార్ ఒక గ్రాండ్ మాస్టర్ అని చెప్పొచ్చు. 50 ఏళ్ళ తన రాజకీయ ప్రస్థానంలో ఎన్నో వ్యూహాత్మక ప్రణాళికలను రచించి అపర చాణక్యుడిగా ఎదిగారు. అలాంటిది ఆయన ఇప్పుడు మోదీ-షాల వ్యూహం ముందు తలొగ్గాల్సి వచ్చిందా.? అంటే.? జరుగుతున్న పరిణామాలని చూస్తుంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. గత కొన్ని రోజుల ముందు శరద్ పవార్ వ్యవసాయ సంక్షోభం గురించి వివరించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఆ సమయంలోనే పవార్ బీజేపీతో సీక్రెట్ డీల్‌ను కూడా కుదరించుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

దీనికి ప్రధాన కారణం ఏమిటి అంటే .. గత శుక్రవారం రాత్రి ఒకరు అంతా ఒకే అనుకోని శివసేనతో ప్రభుత్వ ఏర్పాటుకి సిద్దమైన సమయంలో శనివారం తెల్లవారే సరికి బీజేపీ , ఎన్సీపీ తో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే. కానీ, అజిత్ పవార్ పార్టీకి నమ్మకద్రోహం చేశారని.. బీజేపీతో కలిసే ప్రసక్తే లేదని ఎన్సీపీ నేతలు స్పష్టం చేస్తున్నా.. ఇదంతా శరద్ పవర్ వెనక నుంచి నడిపిస్తున్న పెద్ద డ్రామా అని కొందరు రాజకీయ నేతలు అభిప్రాయ పడుతున్నారు. అలాగే మరో కారణం ఏమిటంటే ... మొదట్లో అజిత్ పవార్ పై మండిపడ్డ ఎంపీ సుప్రియా సూలే ..ఆ తరువాత అజిత్ పవార్ మళ్లీ తిరిగి ఎన్సీపీలోకి రావాలని ఎక్కడ లేని ప్రేమ ఒలకబోస్తోంది. ఆమె అజిత్ ని ఉద్దేశించి .. ఆమె స్టేటస్ ఒకసారి పరిశీలిస్తే.. ‘Who do you trust in life…never felt so cheated in my life… defended him, loved him…look what I get in return’ అంటూ తన వాట్సాప్ స్టేటస్ పెట్టింది.

అలాగే శరద్ పవార్ మోడీ తో భేటీ అయిన సమావేశంలో శరద్ కి రాష్ట్రపతి పదవి ఆఫర్ చేసినట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే ఎంపీ సుప్రియా సూలేకు కూడా మోదీ ప్రభుత్వంలో మంత్రి పదవి ఇవ్వనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇందులో ఎంత నిజం ఉందొ తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి అయితే సస్పెన్స్ సినిమా కంటే ఎక్కవ ట్విస్ట్ లతో మహా రాజకీయం ముందు సాగుతోంది.