Begin typing your search above and press return to search.
సామాన్యుడికి..సిద్ధూకి మధ్య డీల్ ఇదేనా?
By: Tupaki Desk | 20 July 2016 12:34 PM GMTరాజ్యసభ పదవిని కట్టబెట్టిన పార్టీని వద్దు పొమ్మని చెప్పటమే కాదు.. వారిచ్చిన పదవిని లెఫ్ట్ లెగ్ తో కొట్టి ఆవతల పారేసిన మాజీ క్రికెటర్ నవజ్యోత్ సిద్ధూ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పార్టీకి.. పదవికి రాజీనామా చేయటానికి కారణం ఏమిటి? ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు? లాంటి ప్రశ్నలకు చాలానే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.సిద్ధూను ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున పంజాబ్ సీఎం అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగుతారని అందుకు వీలుగా ఆయనీ నిర్ణయం తీసుకున్నట్లుగా చెబుతున్నారు.
ఇదిలా ఉంటే.. అవేమీ నిజం కాదని.. సిద్ధూ రాజీనామా వెనుక అసలు కథ వేరుగా ఉందని.. తాను పదవి కోసం పాకులాడే మనిషిని కాదన్న ఇమేజ్ ను సొంతం చేసుకోవటంతో పాటు.. తనకున్న పేరు ప్రఖ్యాతుల్లో పంజాబీల గుండెల్లో దీర్ఘకాలం సాగేలా ఒక ప్లాన్ వేసుకున్నట్లుగా చెబుతున్నారు. అంతేకాదు.. తాను ఆమ్ ఆద్మీ పార్టీలో చేరాలంటే ఏమేం చేయాలి.. ఏమేం చేయకూడదన్న అంశాలకు సంబంధించి సామాన్యుడి పార్టీని పెట్టిన ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తో ఒక ఒప్పందం చేసుకున్నట్లుగా తెలుస్తోంది.
జాతీయ మీడియాలో వస్తున్న కథనాల్ని చూసినప్పుడు.. సామాన్యుడికి సిద్ధూకి మధ్యన కొన్ని అంశాల మీద ఒక ఒప్పందానికి వచ్చారని.. అందుకు అనుగుణంగానే ఆయన ఆమ్ ఆద్మీ పార్టీలో చేరనున్నట్లుగా చెబుతున్నారు. తాను రానున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగనని.. సీఎం అభ్యర్థిగా తన పేరును ప్రమోట్ చేయకూడదని.. తనకు తోచినట్లుగా.. పంజాబ్ మొత్తాన్ని పర్యటించాలన్న కండీషన్లకు కేజ్రీవాల్ ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది.
తాను కింగ్ గా ఉండే ఛాన్స్ లేదని తేల్చేసిన సిద్ధూ.. ప్రస్తుతానికి కింగ్ మేకర్ పాత్రను పోషించాలన్న ఆకాంక్షను వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. సిద్ధూ కండీషన్లకు కేజ్రీవాల్ సైతం సానుకూలంగా స్పందించినట్లుగా తెలిసింది. తనకు కానీ.. తన భార్యకు కానీ ఎలాంటి పదవి అక్కర్లేదని.. తాము అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయమని.. పార్టీ పదవులు కూడా చేపట్టమని చెప్పినట్లుగా కథనాలు వస్తున్నాయి. మరి.. ఎలాంటి ఆశలు.. ఆకాంక్షలు లేకుండా రాజ్యసభ పదవిని సిద్ధూ వదిలేస్తారా? అన్నది మరో సందేహం. ఏది ఏమైనా ప్రస్తుతానికి కింగ్ మేకర్ పాత్రను పోషించినప్పటికి.. భవిష్యత్తులో ఆయనెలా వ్యవహరిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు. డీల్ మొదట్లో కుదిరినంత చక్కగా కాలక్రమంలో అంతేలా కంటిన్యూ అవుతుందా?