Begin typing your search above and press return to search.
అమెరికాలో ఘోర విమాన ప్రమాదం!
By: Tupaki Desk | 6 July 2020 9:50 AM GMTఅమెరికా లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. రెండు విమానాలు పరస్పరం గాలిలోనే ఢీ కొనడంతో 8 మంది మృతి చెందినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఇద్దరి మృత దేహాల్ని వెలికి తీశారు. మరో ఆరుగురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అమెరికాలోని ఇదాహో రాష్ట్రంలో ఆదివారం (జులై 5) మధ్యాహ్నం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గాలిలో ఢీ కొొన్న తరువాత రెండు విమానాలు కోయర్ డీ అలెన్ సరస్సులో కూలిపోయినట్టు అధికారవర్గాలు వెల్లడించాయి. మృతుల్లో పిల్లలు, పెద్దవాళ్లు కూడా ఉన్నారని సమాచారం.
విమానాల్లో గాల్లో ఢీకొని సరస్సులో కూలిపోయినట్లు కోటెనై కౌంటీ షెరీఫ్ లెఫ్టినెంట్ ర్యాన్ హైజీన్స్ ధ్రువీకరించారు. ప్రమాదం జరిగిన వెంటనే తమకు సమాచారం అందిందని తెలిపారు. విమానాలు రెండూ ఇదాహోలోని కోయర్ డీ-అలెన్ సరస్సులో మునిగిపోయాయని న్యూస్ ఛానెల్ సీఎన్‌ఎన్‌కు ఆయన తెలిపారు. సరస్సు లో మునిగి పోయిన విమానాలను సోనార్ బృందం గుర్తించింది. విమానాల శకలాలను వెలికితీయడానికి ఒకట్రెండు రోజులు పడుతుందని హైజీన్ తెలిపారు.
ప్రమాదానికి గల కారణాలేమిటి? ఘటన జరిగిన సమయంలో ఒక్కో విమానం లో ఎంత మంది ప్రయాణిస్తున్నారు, తదితర వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనపై దర్యాప్తునకు ఆదేశించినట్లు అధికారులు తెలిపారు. విమానాల్లో గాల్లో ఢీకొనడాన్ని పలువురు ప్రత్యక్షం గా చూశారని వారు వెల్లడించారు. సరస్సులో కూలి పోయిన తర్వాత కూడా మరి కొంత మంది చూశారని తెలిపారు. బోట్ల సాయం తో కొంత మంది రెండు మృత దేహాలను వెలికి తీసినట్లు చెప్పారు. మరో ఆరుగురి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.