Begin typing your search above and press return to search.

ఒడిశా రైలు ఘటన.. శవాల గుంపులో తండ్రి ఆవేదన

By:  Tupaki Desk   |   3 Jun 2023 5:30 PM GMT
ఒడిశా రైలు ఘటన.. శవాల గుంపులో తండ్రి ఆవేదన
X
ఒడిశాలో రైలు పట్టాలపై మరణ మృదంగం మోగింది. రెండు సూపర్‌ ఫాస్ట్‌ రైళ్లు, ఓ గూడ్స్‌ రైలు ఢీకొనటం వల్ల ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘోర రైలు ప్రమాదంలో 233 మంది దుర్మరణం పాలయ్యారు. 900 మందికి పైగా గాయాల పాలయ్యారు. అంతా 15 నిమిషాల వ్యవధిలో జరిగిపోయింది ఈ ఘటన. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అంటున్నారు.

ఘటనాస్థలి వద్ద భీతావహ వాతావరణం నెలకొంది. శవాలను గుర్తు పట్టలేనంతగా మారిపోయాయి. కుప్పలు తెప్పలుగా మృతదేహాలను రైల్వే స్టేషన్లలో పేరుస్తున్నారు. అక్కడి వాతావరణం అంతా భయనకంగా మారింది. బాధితులు తమ వాళ్లు ఎక్కడా అంటూ వచ్చి బోరున విలపిస్తున్నారు. గుర్తు పట్టలేనంతగా శవాలు ఉండటంతో... తమ వాళ్లను గుర్తించడంలో చాలా మంది విఫలం అయ్యారు. అంతలా శవాలు చెల్లచెదురుఅయ్యాయి.

ఆ దృశ్యాలు హృదయవిదారకంగా ఉన్నాయి. ఓ వ్యక్తి తన కొడుకును వెతికి పట్టుకోలేకపోయాడు. అతని బాధ వర్ణించలేకుండా ఉంది. మొత్తానికి రైల్వే శాఖ నిర్లక్షం వల్లే ఈ ఘటన జరిగిందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇక ఈ ఘటనలో 12వందల మందికిపైగా సిబ్బంది, 38 ఫైర్‌సేఫ్టీ సిబ్బంది సహాయకచర్యల్లో ఉన్నారు. రైలు ప్రమాద ఘటనా స్థలి వద్ద పరిస్థితిని విజువల్స్ కళ్లకు కడుతున్నాయి.

ఈ ఘోరప్రమాదంలో రైల్వే 'కవచ్‌' టెక్నాలజీపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రైలు ఢీకొనకుండా 2022లో ప్రత్యేకంగా కవచ్‌ టెక్నాలజీ తీసుకువచ్చారు. రైళ్లు ఢీకొనకుండా ఆటోమెటిక్ బ్రేకింగ్‌ సిస్టమ్ ఏర్పాటు చేశారు. అయినా.. ఒడిశా రైలు ప్రమాదంలో కవచ్‌ టెక్నాలజీ పనిచేయకపోవడం అనుమానాలు రేకిత్తిస్తోంది.

కవచ్‌ టెక్నాలజీ కోసం 400 కోట్లు రూపాయలు ఖర్చు చేసింది రైల్వేశాఖ. ఒడిశాలో రైలు ప్రమాదంతో 4 రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. పశ్చిమబెంగాల్, ఒడిశా, ఏపీ, తమిళనాడు ప్రమాదంపై ఆరాతీస్తున్నాయి.

మృతులు, క్షతగాత్రుల వివరాలపై అధికారులతో సమాచారం తెప్పించుకుంటున్నాయి. ఒడిశా రైలు ప్రమాదంపై ప్రధాని మోదీసహా రాహుల్, ఖర్గే, ప్రియాంక గాంధీ, తెలుగురాష్ట్రాల సీఎంలు జగన్‌, కేసీఆర్‌ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.