Begin typing your search above and press return to search.
అమెరికాను వణికిస్తున్న 'డెడ్ లిమిట్'
By: Tupaki Desk | 13 May 2023 7:00 AM GMTప్రపంచ పెద్దన్న పాత్ర పోషిస్తున్న అమెరికాకు కష్ట కాలం దాపరించింది. 'డెడ్ లిమిట్' ని పెంచేందుకు చట్టసభ ప్రతినిధులు సుముఖంగా లేకపోవడమే ఇందుకు కారణం. ఈ ప్రభావం కేవలం అమెరికాపైనే కాకుండా మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పైనే పడనుంది. ఈ విషయాన్ని సాక్షాత్తు అమెరికా ఆర్థిక మంత్రి జెనెట్ యేల్లెన్ ప్రకటించారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
అమెరికా ఖజానా కొన్ని రోజుల్లో ఖాళీ కానుంది. దీని నుంచి బయట పడాలంటే అమెరికా అప్పు చేయాలి. కానీ ఎంత పడితే అంత అప్పు చేయడానికి ఆ దేశ నిబంధనలు ఒప్పుకోవు. అప్పుకు ఓ లెక్కంటూ ఉంటుంది.
దీనిని డెడ్ లిమిట్ లేదా డెడ్ సీలింగ్ అని పిలుస్తారు. అంటే ఆ దేశ పరిమితికి మించిన అప్పు చేయడానికి వీలుండదు. ప్రస్తుతం ఈ సీలింగ్ 31.4 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. అమెరికా ఈ హద్దుని జనవరిలోనే చేరుకుంది.
అమెరికాలో అప్పు చేసే పరిమితిని దాటాలంటే ప్రతినిధుల సభలో ఆమోదం పొందాలి. కానీ అక్కడ అధికార పార్టీ డెమోక్రట్ల సంఖ్య కంటే రిపబ్లికన్ల సంఖ్య ఎక్కువగా ఉంది. డెడ్ లిమిట్ దాటాలన్న డెమోక్రట్ల ప్రతిపాదనకు రిపబ్లికన్లు ససేమిరా అంటున్నారు. దీంతో బిల్లు ఆమోదం పొందడానికి అధికార పార్టీకి మార్గం కనిపించడం లేదు. ఈ వ్యవహారం ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది.
బిల్లు ఆమోదం పొందకపోతే అమెరికాలో ఉండే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, సైనిక సిబ్బంది జీతాలు, పింఛన్ల చెల్లింపులు నిలిచిపోతాయి. జాతీయ పార్కులు, ఏజెన్సీలు మూతపడతాయి. ఆఖరికి వాతావరణ సమాచారం చెప్పే విభాగం కూడా సేవలు చేయలేదు.
ఇలాంటి సమయంలో ఆర్థిక శాఖ ప్రత్యేక అధికారాలు ఉపయోగించే ఉంది. అంటే వేతనాలు, పింఛన్లు ఆపివేయడం, పెట్టుబడులు వాయిదా వేయడం వంటివి. కానీ ఈ చర్యల ద్వారా గండం గట్టెక్కుతుందనే నమ్మకం లేదు. 2011, 2013లో ఇలాంటి పరిస్థితి ఎదురైంది. కానీ చివరి నిమిషంలో సభ ఆమోదం తెలుపటంతో పరిస్థితి సద్దు మణిగింది. మరి ఇప్పుడు అమెరికా ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కొంటుందో ప్రపంచ దేశాలు వేచి చూస్తున్నాయి.