Begin typing your search above and press return to search.

బీచ్ లో డెడ్ బాడీ.. శ్వేత ఆత్మహత్యలో వాస్తవాలు ఇవీ!

By:  Tupaki Desk   |   26 April 2023 7:34 PM GMT
బీచ్ లో డెడ్ బాడీ.. శ్వేత ఆత్మహత్యలో వాస్తవాలు ఇవీ!
X
విశాఖ బీచ్ లో శవమై తేలిన వివాహిత శ్వేతది హత్యా లేక ఆత్మహత్యా అన్న చిక్కుముడి వీడింది. సముద్రంలోంచి ఒడ్డుకు కొట్టుకు వచ్చినది శ్వేతది ఆత్మహత్యనే అని ప్రాథమికంగా నిర్ధారించారు పోలీసులు. ఈ మేరకు మీడియాకు న్యూపోర్ట్ పోలీసులు వెల్లడించారు.

శ్వేత డెడ్ బాడీ సముద్రంలోంచి కొట్టుకురావడం.. బట్టలు సరిగా లేకపోవడంతో ఇది హత్యనా? లేక మరేదైనా అఘాయిత్యం జరిగిందా? అన్న ప్రచారం మీడియాలో బాగా జరిగింది. అయితే పోలీసులు మాత్రం శ్వేత ఒంటిపై ఎలాంటి గాయాలు లేవని.. ఆమెది ఆత్మహత్య అని తేల్చారు. భర్తతో గొడవలు కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.

దర్యాప్తులో మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉన్నట్టు న్యూపోర్ట్ పోలీసులు తెలిపారు. శ్వేత చివరి సారిగా భర్తతో ఫోన్ తో మాట్లాడిందని.. గొడవ జరిగిందని.. ఆమె ఫోన్ కట్ చేసి స్విచ్ఛాఫ్ చేసిందని పోలీసులు తెలిపారు. ఆమె మనస్థాపంతోనే ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిపారు.

రాత్రి 7 గంటలప్పుడు బీచ్ లో శ్వేతను ఒక మహిళ చూశారని.. ఆమెనే పోలీసులకు తెలిపారని వివరించారు. మొబైల్ ను ఇంటిదగ్గరే వదిలేసి పోయిందని పోలీసులు తెలిపారు. భర్తతో గొడవల కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రాథమికంగా నిర్ధారించుకున్నామని తెలిపారు.

ఇక శ్వేత సంవత్సరం కిందటే వివాహమైంది. ప్రస్తుతం గర్భవతి. ఆమె భర్త సాఫ్ట్ వేర్ ఇంజినీర్. వర్క్ ఫ్రం హోం పేరిట వైజాగ్ లోనే జాబ్ చేస్తున్నాడు. ఇటీవల హైదరాబాద్ కంపెనీలో చేరాలని అతడికి సమాచారం రావడంతో షిఫ్టింగ్ ఆలోచన చేస్తున్నాడు.

ఇక వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చాయని.. నెలరోజుల క్రితం కూడా విడాకులు ఇస్తామని శ్వేతను బెదిరించారని శ్వేత తల్లి రమాదేవి ఆరోపిస్తోంది. కడుపుతో ఉన్నా వేధించారని అంటోంది. ఇక చిన్న చిన్న సమస్యలు అవని.. సర్దుకు పోవాలని చెప్పినట్టు భర్త మణికంఠ మీడియాకు చెప్పాడు. కనీసం కడుపులో ఉన్న బిడ్డ కోసమైనా ఆమె ఆలోచించి ఉంటే బాగుండేదని.. తాను ఫోన్ చేసి మాట్లాడక స్విచ్ ఆఫ్ చేసిందని.. ఎన్ని సార్లు చేసినా కలవలేదని తెలిపాడు.