Begin typing your search above and press return to search.
లోటస్ పాండ్ లో మృతదేహం.. కలకలం
By: Tupaki Desk | 25 Oct 2020 10:30 AM GMTహైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో మృతదేహం కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తి శవం లభ్యమైంది. ప్రస్తుతానికి బంజారాహిల్స్ పోలీసులు మృతేదేహాన్ని బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది.
ఇటీవల భారీ వర్షాలు హైదరాబాద్ లో పడ్డాయి. చాలామంది కొట్టుకుపోయారు. దీంతో ఈ మృతదేహం వారిదా? లేక ఇది హత్యనా? లేక ఆత్మహత్యనా అనే కోణంలో బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మరోపక్క లోటస్ పాండ్ లో వాకింగ్ కోసం వచ్చిన వ్యక్తి అయ్యి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
కాగా మిస్సింగ్ కేసులను కూడా పోలీసులు విచారిస్తున్నారు. చనిపోయిన వ్యక్తి టీషర్ట్, ట్రాక్ పాయింట్ వేసుకున్నట్టు పోలీసులు గుర్తించారు. వివరాలు తెలుసుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
హైదరాబాద్ లోని ఏపీ సీఎం జగన్ ఇంటికి సమీపంలో లోటస్ పాండ్ ఉంటుంది. ఇక్కడ మృతదేహం దొరకడంతో సంచలనంగా మారింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లోటస్ పాండ్ చుట్టుపక్కల నివసించే వారిని కూడా ఆరా తీస్తున్నారు.