Begin typing your search above and press return to search.

షాకింగ్ కలకలం.. హైదరాబాద్ ఓవర్ హెడ్ ట్యాంకులో డెడ్ బాడీ

By:  Tupaki Desk   |   8 Dec 2021 4:34 AM GMT
షాకింగ్ కలకలం.. హైదరాబాద్ ఓవర్ హెడ్ ట్యాంకులో డెడ్ బాడీ
X
హైదరాబాద్ మహానగరంలో షాకింగ్ ఉదంతం ఒకటి చోటు చేసుకుంది. విన్నంతనే ఉలిక్కిపడటమే కాదు.. ఈ విషయాన్ని మరికాస్త ఆలోచించినా.. జీర్ణించుకోలేని వికారంగా మారిన ఈ ఉదంతం దిమ్మ తిరిగేపోయేలా మారింది.

ముషీరాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలోని హరినగర్ రీసాలగడ్డ వాటర్ ట్యాంక్ లో గుర్తు తెలియని వ్యక్తి డెడ్ బాడీ కనిపించటం ఇప్పుడు నోట మాట రాని విధంగా మారింది. వాటర్ ట్యాంకును క్లీన్ చేయటానికి వచ్చిన వాటర్ సిబ్బంది.. డెడ్ బాడీ కనిపించటంతో ఒక్కసారి షాక్ తిన్నారు.

తీవ్ర ఆందోళనకు గురైన వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న వారు.. డెడ్ బాడీని స్వాధీనం చేసుకొని.. కేసు నమోదు చేసుకొని విచారణ మొదలు పెట్టారు.

ఓవర్ హెడ్ ట్యాంకర్ లోకి శవం ఎలా వచ్చింది? అనుకోని విధంగా.. ప్రమాదవశాత్తు ఎవరైనా వాటర్ ట్యాంక్ లోకి పడ్డారా? లేదంటే.. ఎవరైనా చంపేసి.. వాటర్ ట్యాంకులో పడేశారా? అన్నది ప్రశ్నగా మారింది.

జలమండలికి చెందిన ఈ ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకర్ లో డెడ్ బాడీ ఉందన్న విషయాన్ని గుర్తించిన విషయం దావనంలా చుట్టుపక్కల వారికి చేరింది. పెద్ద ఎత్తున స్థానికులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

ఎన్ని రోజుల క్రితం డెడ్ బాడీ ట్యాంకర్ లో పడిందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. శవ పరీక్ష కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉంటే.. గడిచినకొద్ది రోజులుగా వాటర్ ట్యాంక్ ద్వారా వచ్చే మున్సిపల్ వాటర్ ను తాగుతున్న ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వారి పరిస్థితిని మిగిలిన వారు జీర్ణించుకోలేని పరిస్థితి. ఇంతకూ.. ఈ ఉదంతం అసలెలా జరిగింది? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.