Begin typing your search above and press return to search.

విజయవాడ కారులో డెడ్ బాడీ కేసులో కొత్త ట్విస్ట్

By:  Tupaki Desk   |   19 Aug 2021 4:30 PM GMT
విజయవాడ కారులో డెడ్ బాడీ కేసులో కొత్త ట్విస్ట్
X
విజయవాడలో లగ్జరీ కారులో శవమై తేలిన వ్యక్తి కేసులో కీలక ట్విస్ట్ నెలకొంది. ఈ వ్యక్తి రాహుల్ అని తేలింది. రాహుల్ ఎలా చనిపోయాడు? ఎవరైనా హత్యచేశారా? ఆత్మహత్యనా? అన్న కోణంలో విచారణ జరిపారు.

తాజాగా కారు డోర్స్ ను ఓపెన్ చేశారు పోలీసులు. స్మార్ట్ కార్ ఎక్స్ పర్ట్ సాయంతో డోర్స్ ఓపెన్ చేశారు. మాచవరంలో పార్క్ చేసిన కారులో ఉన్న మృతదేహం తాడిగడపకు చెందిన కరణం రాహుల్ ది అని పోలీసులు గుర్తించారు.

ఫోర్డ్ ఎండీవర్ ఓనర్ రాహుల్ అని తేల్చారు. జి.కొండూరులో ఉన్న జిక్సిన్ సిలిండర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ యజమాని కరణం రాహుల్. అయితే అనుమానాస్పదరీతిలో కారులో రాహుల్ డెడ్ బాడీ కనిపించడం స్థానికంగా కలకలం రేపుతోంది. రాహుల్ ఎలా చనిపోయాడనేది అటు కుటుంబ సభ్యులకు కూడా మిస్టరీగా ఉంది.

నిపుణులతో కారు డోర్లు ఓపెన్ చేయించగా.. డ్రైవర్ సీటులో ప్లాస్టిక్ తాడు దొరికింది. గొంతుకు తాడు బిగించి హత్య చేసినట్లుగా అనుమానిస్తున్నారు. రాహుల్ ది హత్యేనని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. మృతదేహాన్ని మార్చురీకి తరలించారు.

జిక్సన్ కంపెనీ వ్యాపార లావాదేవీల్లో విభేదాలుున్నాయా? పార్ట్ నర్స్ మధ్య గొడవలా? అన్నది తేలాల్సి ఉంది. రాహుల్ మాచవరం ఎందుకు వచ్చాడనేది కూడా మిస్టరీగా ఉంది. కరణం రాహుల్ కు వ్యాపార లావాదేవీల్లో విభేదాలు ఉన్నట్టు తెలుస్తోంది. రాహుల్ బుధవారం నుంచి కనిపించకుండాపోవడంతో పెనమలూరు పోలీస్ స్టేషన్ లో రాత్రి మిస్సింగ్ కేసు నమోదు చేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. అయితే ఉదయమే కారులో శవంగా దర్శనమివ్వడంతో కలకలం చెలరేగింది.

బుధవారం రాత్రి 7.30 గంటలకు ఇంటి నుంచి బయటకు వెళ్లిన రాహుల్ తిరిగి రాకపోవడంతో పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ ఉంది. అనుమానాస్పద స్థితిలో మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.