Begin typing your search above and press return to search.

నీలిరంగులో డెడ్ బాడీ.. కొత్త వైరస్ అనుకున్నారు.. ప్రియుడు ఏం చేశాడంటే..?

By:  Tupaki Desk   |   2 Jun 2021 1:30 AM GMT
నీలిరంగులో డెడ్ బాడీ.. కొత్త వైరస్ అనుకున్నారు.. ప్రియుడు ఏం చేశాడంటే..?
X
ఎంత సీక్రెట్ గా వ్య‌వ‌హారం న‌డిపించినా.. వివాహేత‌ర సంబంధం బ‌య‌ట ప‌డ‌డం అనివార్యం. కొన్ని పంచాయ‌తీల‌తో ఆగిపోతే.. మ‌రికొన్ని ప్రాణాలు పోయేదాకా తెస్తాయి. ఇప్ప‌టి వ‌ర‌కు కొన్ని వేల సంఘ‌ట‌న‌లు ఈ విష‌యాన్ని రుజువు చేశాయి. అయిన‌ప్ప‌టికీ.. ఇల్లీగ‌ల్ కాంటాక్టులు న‌డిపించేవారు మాత్రం ప‌ట్టించుకోవ‌ట్లేదు. ముంబైలో వెలుగు చూసిన ఓ ఉదంతం పోలీసుల‌ను తీవ్ర ఆందోళ‌న‌కు గురిచేసింది.

ముంబైలోని ఎయిర్ పోర్ట్ ప్రాంతం. దానికి స‌మీపంలో ఓ మ‌హిళ డెడ్ బాడీ క‌నిపించింది. వెంట‌నే స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు. వారు వెళ్లి చూసి ఆశ్చ‌ర్యం వ్య‌క్తంచేశారు. ఆ మ‌హిళ చ‌నిపోవ‌డం ఒకెత్త‌యితే.. ఆమె శ‌రీరం మొత్తం నీలం రంగులోకి మారిపోయింది! దేశంలో క‌రోనా వైర‌స్ అత్య‌ధికంగా ప్ర‌భావం చూపిన ప్రాంతాల్లో ముంబై ఒక‌టి. ఈ గోల‌తోనే చ‌స్తుంటే.. ఇదేమైనా కొత్త ర‌కం వైర‌స్ అయి ఉంటుందా? అని బెంబేలెత్తిపోయారు.

వెంట‌నే వైద్య సిబ్బందిని రంగంలోకి దించారు. డెడ్ బాడీని త‌ర‌లించి, ప‌రీక్షించారు. అప్పుడుకానీ.. వారి మ‌న‌సు కుదుట ప‌డ‌లేదు. అది కొత్త వైర‌స్ ఏమీ కాద‌ని తేల్చారు వైద్యులు. అదే స‌మ‌యంలో ఆమెపై విష‌య ప్ర‌యోగం జ‌రిగింద‌ని నిర్ధారించారు. దీంతో.. ఈ ప‌ని చేసింది ఎవ‌రు? అని తేల్చేందుకు సిద్ధ‌మ‌య్యారు.

పోలీసుల‌కు లభించిన వివ‌రాల ఆధారంగా ప్ర‌క‌ట‌న ఇచ్చారు. ఓ వ్య‌క్తి వ‌చ్చి, ఆమె త‌న సోద‌రి అని చెప్పాడు. దీంతో.. అత‌న్ని విచారించిన పోలీసుల‌కు అస‌లు విష‌యం తెలిసిందే. ఆమె ఒక ఆసుప‌త్రిలో ప‌నిచేసే వార్డు బాయ్ తో వివాహేత‌ర సంబంధం కొన‌సాగించింద‌ట‌. దీంతో.. అత‌గాడిని వెతుక్కుంటూ వెళ్లారు. ముందుగా త‌న‌కేమీ తెలియ‌ద‌ని చెప్పిన ఆ వ్య‌క్తి.. ఆ త‌ర్వాత అస‌లు విష‌యం చెప్ప‌క త‌ప్ప‌లేదు.

ఏదో అనారోగ్యంతో ఆసుప‌త్రికి వెళ్లిన ఆమెతో.. స‌ద‌రు వార్డు బాయ్ కు ప‌రిచ‌యం ఏర్ప‌డింది. అది వివాహేత‌ర బంధానికి దారితీసింది. దాదాపు 9 నెల‌ల‌పాటు వీరి రిలేష‌న్ కంటిన్యూ అయ్యింది. అయితే.. కొంత‌కాలంగా త‌న‌ను పెళ్లి చేసుకోవాల‌ని ప‌ట్టుబ‌ట్టింద‌ట స‌ద‌రు మ‌హిళ‌. ఆమెకు పెళ్లై విడాకుల‌య్యాయి. అత‌నికి కూడా పెళ్లైంది. కుటుంబం ఉంది. మ‌రి, వీరి పంచాయితీ ఎక్క‌డి దాకా వెళ్లిందో తెలియ‌దుగానీ.. అత‌ను చంపేయాల‌ని నిర్ణ‌యించుకున్నాడు.

నీ ఆరోగ్యాన్ని బాగుచేసే మందు తెచ్చాను ర‌మ్మ‌ని ఆమెను పిలిచాడు. ఎయిర్ పోర్టు స‌మీపంలో క‌లుసుకున్న త‌ర్వాత డ్ర‌గ్స్‌, పాయిజ‌న్‌, ఇంకా ప‌లుర‌కాల మందులు క‌లిపి ఆమెకు ఇంజెక్ట్ చేశాడు. ఫ‌లితంగా.. కాసేప‌ట్లోనే ప్రాణాలు కోల్పోయిందట‌. ఇల్లీగ‌ల్ వ్య‌వ‌హారం ఎప్పుడూ విషాదంగానే ముగుస్తుంద‌ని చెప్ప‌డానికి లేటెస్ట్ ఎగ్జాంపుల్ గా మిగిలిపోయింది వీరి ఎపిసోడ్‌.