Begin typing your search above and press return to search.
గంగలో కొట్టుకొస్తున్న మృతదేహాలు.. దయనీయంగా పరిస్థితులు !
By: Tupaki Desk | 12 May 2021 4:30 AM GMTకరోనా సృష్టించిన విలయానికి దేశం చిగురుటాకులా వణుకుతోంది. సరైన సమయానికి వైద్యం, ఆక్సిజన్ అందక కరోనా బాధితుల ప్రాణాలు గాల్లో కలిసిపోతుంటే, కొన్ని చోట్ల అంత్యక్రియలకు కూడా నోచుకోవడంలేదు. నదుల్లో మృతదేహాలు తెలియాడుతున్న దృశ్యాలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా గంగానదిలో భారీగా మృతదేహాలు కొట్టుకురావడం బిహార్ లోని బక్సర్ జిల్లాలో కలకలం రేగింది. ఉత్తరప్రదేశ్, బీహార్‌కు చెందినవిగా భావిస్తున్న మృతేదేహాలు ఈ రోజు మరిన్ని బయట పడటంతో తీవ్ర ఆందోళన నెలకొంది. గంగానదిలో ఒడ్డుకు కొట్టుకొస్తున్న శవాల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఒకవైపు భయంకరంగా విస్తురిస్తున్న కరోనా, మరోవైపు రెండు రాష్ట్రాల మధ్య సరిహద్దు సమీపంలో గంగా నదిలో శవాలు తేలుతూ కనిపించడంతో ప్రజలు మరింత వణికిపోతున్నారు.
సోమవారం బిహార్ జిల్లా బక్సర్ వద్ద గంగానదిలో భారీగా మృతదేహాలు తేలగ, బక్సర్ నుండి 55 కి.మీ. దూరంలో మంగళవారం ఉత్తరప్రదేశ్, ఘాజీపూర్ సమీపంలో నదిలో మృతదేహాలు కనిపించాయి. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇవన్నీ ఉత్తరప్రదేశ్ కు చెందినవేనని బిహార్ అధికారులు వాదిస్తున్నారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుండటంతో కరోనా బాధితులు, కుటుంబాలకు లభిస్తున్న గౌరవంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. యూపీ సరిహద్దు సమీపంలో బిహార్‌లోని సరన్‌లో ఉన్న జైప్రభా సేతు అనే వంతెనపైనుంచి అంబులెన్స్‌ల నుంచి కోవిడ్ బాధితుల మృతదేహాలను డ్రైవర్లు నదిలోకి విసిరివేస్తున్నారని బిహార్ బిజెపి ఎంపీ జనార్థన్ సింగ్ సిగ్రివాల్ ఆరోపించారు. దీనిపై కఠిన చర్యలు చేపట్టాల్సిందిగా సరన్ జిల్లా యంత్రాంగాన్ని కోరినట్లు తెలిపారు.
అయితే ఇరు రాష్ట్రాలు వారు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని స్థానికులు చెబుతున్నారు. యూపీ, బిహార్ రెండు రాష్ట్రాలకు చెందిన మృతదేహాలను తీసుకొచ్చి గంగానదిలో వేస్తున్నారని స్థానికుడు అరవింద్ సింగ్ ఆరోపించారు. మృతదేహాలను దహనం చేయడానికి కట్టెలకు అధిక ధరలు వసూలు చేస్తున్నందు వల్లే మృతదేహాలను స్థానిక ప్రజలు నదిలోకి విసిరేస్తున్నారన్న వాదనలను బక్సర్ జిల్లా మేజిస్ట్రేట్ అమన్ సమీర్ తోసిపుచ్చారు. శశ్మానాల్లో తగినంత కట్టెలు ఉన్నాయనీ, ప్రతి రోజు సగటున ఆరు నుండి ఎనిమిది మృతదేహాలు దహనం చేస్తున్నామని తెలిపారు. మరోవైపు ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారని మంత్రి సంజయ్ కుమార్ ఝా అన్నారు. మృతదేహాలు యూపీ నుంచి బిహార్ లో తేలుతున్నాయన్నారు. అటు కరోనాతో చనిపోయిన వారికి, ఇటు పవిత్ర గంగానదికి కూడా తగిన గౌరవం లభించాలని సీఎం భావిస్తున్నారన్నారు. అలాగే ఈ డెడ్ బాడీస్ దాదాపు నాలుగైదు రోజులనాటివని పోస్టుమార్టం నివేదికలో తమ వైద్యులు ధృవీకరించారని తెలిపారు. గతంలో అంత్యక్రియలకు ఐదు నుంచి ఆరు వేలు తీసుకునేవారు.. ప్రస్తుతం రూ.15 వేలు వసూలు చేస్తున్నారని చెప్పాడు. గంగానది పరివాహక ప్రాంతంలోని గ్రామాలు ఈ జలాలనే ఉపయోగిస్తుంటాయి. పదుల సంఖ్యలో మృతదేహాలను నదిలో పడేయటం వల్ల జలాలు కలుషితమై మరో కొత్త మహమ్మారి విజృంభించే అవకాశం ఉంది.