Begin typing your search above and press return to search.

డివిలియర్స్​ కు మళ్లీ నిరాశ !

By:  Tupaki Desk   |   19 May 2021 2:30 AM GMT
డివిలియర్స్​ కు మళ్లీ నిరాశ !
X
విధ్వంసకర బ్యాట్స్​మెన్​ ఏబీ డివిలియర్స్​కు మరోసారి నిరాశ తప్పడం లేదు. అతడు రీ ఇంట్రీ ఇస్తాడని.. తన దేశం తరఫున ఆడతాడని ఫ్యాన్స్ ఎంతో ఎదురుచూస్తున్నారు. కానీ ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఐపీఎల్​ లో మెరుగైన ప్రదర్శన ఇవ్వడంతో ఏబీడీకి ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్​ ఏర్పడ్డారు. ఐపీఎల్​ లో ఆర్​సీబీ తరఫున ఆడే డివిలియర్స్​ ఎన్నోసార్లు మెరుగైన ప్రదర్శన ఇచ్చాడు. రికార్డులు, వ్యక్తిగత ప్రదర్శనతో సంబంధం లేకుండా జట్టు గెలుపుకోసమే అతడు ఆడుతుంటాడు.

ఇదిలా ఉంటే దక్షిణాఫ్రికా వెస్టిండీస్​ టూర్​ కోసం జట్టును ప్రకటించింది. కానీ డివిలియర్స్​ కు మాత్రం అవకాశం దక్కలేదు. తాజాగా దక్షిణాఫ్రికా 19 మందితో కూడిన టీ20 జట్టును ప్రకటించింది. అందులో డివిలియర్స్‌ కు స్థానం దక్కలేదు. దీంతో డివిలియర్స్​ ఆశలు అడియాసలయ్యాయి. అయితే త్వరలో జరగబోయే టీ20 వరల్డ్​ కప్​ కు కూడా అతడి పేరు పరిశీలించే అవకాశం లేదని తేలిపోయింది.

ఒకవేళ వెస్టిండీస్​ టూర్​ కు ఏబీడీ పేరు ప్రతిపాదనలో ఉంటే టీ20 వరల్డ్​కప్ లో అతడికి చాన్స్​ దక్కేదేమో. ఐపీఎల్ 2021లో ఏబీ డివిలియర్స్ అదరగొట్టాడు. 164.28 స్ట్రైక్‌రేట్‌ తో ఏబీ 207 పరుగులు చేశాడు. పరుగుల వరద పారించాడు. కానీ అతడికి తన దేశం మాత్రం అవకాశం ఇవ్వలేదు. ఐపీఎల్ 2018 సీజన్ ముగిసిన స్వదేశానికి వెళ్లిన ఏబీ డివిలియర్స్.. అంతర్జాతీయ క్రికెట్​ కు గుడ్​బై చెప్పాడు. ఏబీడీ నిర్ణయంతో అంతా షాక్​కు గురయ్యారు. అయితే ఆ తర్వాత మనసు మార్చుకున్న ఏబీడీ తాను తిరిగి ఆడబోతున్నట్టు ప్రకటించాడు.

కానీ అతడికి 2019 వరల్డ్​కప్​లో చాన్స్​ రాలేదు. వరల్డ్​కప్​ లో దక్షిణాఫ్రికా పేలవమైన ప్రదర్శన ఇచ్చింది. ఒకవేళ ఏబీడీ ఉంటే పరిస్థితి మరోలా ఉండేదేమోనన్న చర్చ కూడా తెరమీదకు వచ్చింది. ఇక అప్పటినుంచి ఏబీడీ రీ ఎంట్రీపై వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ అతడికి ఆ దేశ క్రికెట్​ బోర్డు మాత్రం అవకాశం ఇవ్వడం లేదు. ఏబీడీ అద్భుతమైన బ్యాట్స్​మెన్​. ఐపీఎల్​ లో అతడు ఎన్నో మ్యాచ్​ లను మలుపుతిప్పాడు. స్టేడియంలోని అన్ని వైపులా సిక్సులు కొట్టడం.. రన్​రేట్​ ను వేగంగా పెంచడం.. పరుగుల వరద పారించడం.. మ్యాచ్​ ను వన్​సైడ్​ చేయడం అతడి స్పెషాలిటీ. కానీ ఏ కారణం వల్లో ప్రస్తుతం అతడికి అవకాశాలు దక్కడం లేదు.

దక్షిణాఫ్రికా టీ20 జట్టు ఇదే..బావుమా, డికాక్, ఫోర్టుయిన్, రీజా హెండ్రిక్స్, క్లాసేన్, లిండే, మగాలా, జన్నెమాన్ మలన్, మార్క్రామ్, మిల్లర్, ఎంగిడి, నోర్జ్, రబాడా, షంసీ, డుసెన్, వెర్రిన్నే, లిజాడ్ విలియమ్స్, ప్రిటోరియస్, ఫెహ్లుక్వాయో.