Begin typing your search above and press return to search.

కొవిషీల్డ్, కొవాగ్జిన్ వ్యాక్సిన్ల మిశ్రమానికి డీసీజీఐ ఓకే

By:  Tupaki Desk   |   11 Aug 2021 6:31 AM GMT
కొవిషీల్డ్, కొవాగ్జిన్ వ్యాక్సిన్ల మిశ్రమానికి డీసీజీఐ ఓకే
X
కరోనా వైరస్ మహమ్మారి కట్టడికి వ్యాక్సినేషనే కీలకంగా మారిపోయింది. ఇప్పటికే పలు రకాల వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. స్వదేశీ, విదేశీ వ్యాక్సిన్ల సరిఫరా కొనసాగుతోంది. తాజాగా, అమెరికా సంస్థకు చెందిన సింగిల్ డోస్‌ వ్యాక్సిన్‌ కు కూడా భారత్ గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది. మరోవైపు, ఎప్పటికప్పుడు కొత్త వేరియంట్లు వెలుగులోకి వస్తున్నాయి, వాటిపై కూడా అధ్యయనాలు కొనసాగుతున్నాయి.. ఇక, స్వదేశీ టీకాలైన కోవిషీల్డ్, కోవాగ్జిన్‌ కలిపి, ఒకటే టీకాగా వేస్తే ఫలితాలు ఎలా ఉంటాయని అనేదానిపై భారత వైద్య పరిశోధన మండలి తాజాగా చేపట్టిన అధ్యయనంలోనూ టీకా మిక్సింగ్ మంచి ఫలితాలను ఇస్తున్నట్టు వెల్లడైంది.

ఉత్తరప్రదేశ్‌ లో మే, జూన్ నెలల్లో ఈ అధ్యయనం జరగగా.. రకరకాల వేరియంట్ల ద్వారా విడతల వారీగా జరుగుతున్న కరోనా దాడిని నిరోధించేందుకు ఇది ప్రభావశీలమైన ఆయుధమని కూడా శాస్త్రవేత్తలు భావనగా ఉంది. అంటే, మొదటి డోసుగా కోవిషీల్డ్, రెండో డోసుగా కొవాగ్జిన్ వ్యాక్సిన్‌ ఇస్తే.. ఈ విధానం సురక్షితమైనదే కాకుండా కొత్త కరోనా వేరియంట్ల నుంచి మెరుగైన రక్షణ కూడా ఇస్తున్నట్టు ఈ అధ్యయనం తేల్చింది. కోవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్ల మిక్సింగ్‌పై అధ్యయనానికి డీసీజీఐ అనుమతిచ్చింది. తమిళనాడులో గల వెల్లూర్ క్రిస్టియన్ మెడికల్ కాలేజీలో అధ్యయనం నిర్వహించనుంది. వ్యాక్సినేషన్ కోర్సుని పూర్తి చేయడానికి ఒక వ్యక్తికి రెండు వేర్వేరు వ్యాక్సిన్ డోసులను ఇవ్వగలమా లేదా అని అంచనా వేయడడే అధ్యయనం యొక్క ముఖ్య ఉద్దేశ్యం.

జులై-29న సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్‌ కి చెందిన సబ్జెక్ట్ ఎక్స్ పర్ట్ కమిటీ అధ్యయ నిర్వహణకు రికమండ్ చేసింది. కరోనా వైరస్ వ్యాక్సిన్‌ లు, కోవాక్సిన్ మరియు కోవిషీల్డ్‌ మిక్సింగ్ కోసం 300 మంది ఆరోగ్యవంతులైన వాలంటీర్లపై ఫేజ్ -4 క్లినికల్ ట్రయల్ నిర్వహించడానికి వెల్లూర్‌ క్రిస్టియన్ మెడికల్ కాలేజీకి అనుమతి ఇవ్వాలని CDSCO నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది. ఆ తర్వాత డీసీజీఐ కూడా పర్మిషన్ ఇచ్చింది. ఇక వేసవిలోనే కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. గతేడాది సమ్మర్‌ లో కరోనా ఇంపాక్ట్ ఎక్కువగానే ఉంది. ఈ సారి సెకండ్ వేవ్ వల్ల యువత పిట్టల్లా రాలిపోయారు.

థర్డ్‌ వేవ్ పిల్లలకు అని ప్రచారం జరుగుతోంది. వచ్చే నెలలో అని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఆందోళన నెలకొంది. మరోవైపు వచ్చే ఏడాది సమ్మర్‌ లో ఫోర్త్ వేవ్ అని కూడా అంటున్నారు. దీంతో కరోనా 5,6 ఏళ్లు ఉంటుందని అర్థం చేసుకోవచ్చు. వానకాలం రావడంతో ఫంగస్ ఇంపాక్ట్ తగ్గుతుందని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పటివరకు బ్లాక్ ఫంగస్ ఇంపాక్ట్ కనిపించింది. మొత్తానికి కరోనాతో కలిసి బతకాల్సిందే.. అందుకోసం విధిగా మాస్క్ ధరించి, శానిటైజర్ రాసుకుంటూ కాలం వెళ్లదీయాల్సిందే. రెండు డోసులతోపాటు బూస్టర్ డోస్ టీకా కూడా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం అయితే అందరికీ సెకండ్ డోసు ఇస్తున్నారు. ఇది పూర్తయితే దేశంలో చాలా మంది రెండు డోసులు తీసుకున్నట్టు అవుతుంది. దీంతోపాటు బూస్టర్ డోసు వేసుకోవాలని నిపుణులు సూచన చేస్తున్నారు. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం విధాన నిర్ణయం అయితే ప్రకటించలేదు. డిసిషన్ తీసుకోవాల్సి ఉంది. త్వరలో తీసుకునే అవకాశం ఉంది.