Begin typing your search above and press return to search.

మోడెర్నా టీకా దిగుమ‌తికి డీసీజీఐ గ్రీన్‌ సిగ్న‌ల్‌ !

By:  Tupaki Desk   |   29 Jun 2021 12:30 PM GMT
మోడెర్నా టీకా దిగుమ‌తికి డీసీజీఐ గ్రీన్‌ సిగ్న‌ల్‌ !
X
కరోనా వైరస్ మహమ్మారి కట్టడికి మన దగ్గర ఉన్న ఏకైక మార్గం వ్యాక్సిన్ మాత్రమే. వ్యాక్సిన్ ఒక్కటే కరోనా నివారణకు మార్గం. అందుకే అన్ని దేశాలు కూడా వ్యాక్సినేషన్ ను వేగవంతం చేస్తున్నాయి. మనదేశంలో కూడా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతుంది. ఇప్పటికే పలు వ్యాక్సిన్లు దేశంలో అందుబాటులోకి రాగా, తాజాగా మరో క‌రోనా వైర‌స్ వ్యాక్సిన్ వ‌స్తోంది. అమెరికా కంపెనీ మోడెర్నా త‌యారు చేసిన వ్యాక్సిన్ దిగుమ‌తి, అత్య‌వ‌స‌ర వినియోగానికి మంగ‌ళ‌వారం డ్ర‌గ్స్ కంట్రోల‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ ఇండియా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. ముంబైలోని ఫార్మా సూటిక‌ల్ కంపెనీ సిప్లా ఈ వ్యాక్సిన్‌ను ఇండియాకు దిగుమ‌తి చేసుకోనుంది.

సోమ‌వార‌మే ఈ సంస్థ దీనికోసం డీసీజీఐ అనుమ‌తి కోరుతూ ద‌ర‌ఖాస్తు చేసుకుంది. మోడెర్నా అనేది మెసెంజ‌ర్ ఆర్ ఎన్ ఏ వ్యాక్సిన్‌, ఇది కరోనా వైరస్ పై 90 శాతం స‌మ‌ర్థంగా ప‌ని చేస్తున్న‌ట్లు తేలింది. ఇండియాలో క‌రోనా వైర‌స్ కోసం అత్య‌వ‌స‌ర అనుమ‌తి పొందిన నాలుగో వ్యాక్సిన్ మోడెర్నా. ఇప్ప‌టికే కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌, స్పుత్నిక్ వి ల‌కు డీసీజీఐ అనుమ‌తి ఇచ్చిన విష‌యం తెలిసిందే. కాగా మెడర్నావ్యాక్సిన్‌ దిగుమతికి అనుమతిని కోరుతూ డీసీజీఐకి సిప్లా దరఖాస్తు చేసుకుంది. తొంభై శాతం సమర్ధతను కలిగి ఉన్న రెండు డోసుల మోడర్నా ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగానికి కెనడా, అమెరికా, బ్రిటన్‌ వంటి దేశాలలో ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమ‌తినిచ్చింది. ఈ నేపథ్యంలో కోట్ల డోసులను ఇప్పటికే పంపిణీ చేసిన సంగతి తెలిసిందే.