Begin typing your search above and press return to search.
చరిత్ర సృష్టించిన ఢిల్లీ.. రైజర్స్ చిత్తు చేసి తొలిసారి ఫైనల్ కు
By: Tupaki Desk | 9 Nov 2020 7:50 AM GMTఢిల్లీ క్యాపిటల్స్ చరిత్ర సృష్టించింది. తొలిసారి టైటిల్ పోరు కోసం ఫైనల్లో అడుగు పెట్టింది. క్వాలిఫైయర్స్ -2లో సన్ రైజర్స్ ని చిత్తు చేసి 17 పరుగుల తేడాతో విజయం సాధించింది. అటు బ్యాటింగ్ లోనూ ఇటు బౌలింగ్ లోనూ సత్తా చాటి తుది పోరుకు దూసుకెళ్ళింది. ఇక ఫైనల్లో ముంబై ఇండియన్స్ పోరుకు సిద్ధం అయ్యింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ (50 బంతుల్లో 78; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) మరో చక్కటి అర్ధసెంచరీ సాధించాడు. ఓపెనర్ గా బరిలోకి దిగిన స్టొయినిస్ (27 బంతుల్లో 38; 3 ఫోర్లు, సిక్స్), ఆఖర్లో హెట్‌మైర్ (22 బంతుల్లో 42 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) మెరుపులు మెరిపించారు. దీంతో ఢిల్లీ భారీ స్కోరు సాధించింది. లక్ష్యఛేదనలో సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 172 పరుగులే చేసి ఓటమి చెందింది.
కెప్టెన్ వార్నర్ కీలక సమయంలో చేతులెత్తగా కేన్ విలియమ్సన్ (45 బంతుల్లో 67; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) అద్భుత పోరాటం చేశాడు. అయితే అతడికి సహకరించేవారు లేకపోవడంతో రైజర్స్ ఓటమి మూటగట్టుకుంది. వార్నర్ (2), ప్రియమ్ గార్గ్ (17; 2 సిక్స్‌లు)మనీశ్ పాండే (14 బంతుల్లో 21; 3 ఫోర్లు) విఫలం కావడంతో రైజర్స్ 44 పరుగులకే 3 కీలక వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. కేన్ విలియమ్సన్, హోల్డర్(11),అబ్దుల్ సమద్ (16 బంతుల్లో 33; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు)తో కలిసి టార్గెట్ ని అందుకోవడానికి పోరాటం చేశాడు.19 బంతుల్లో 43 పరుగులు చేయాల్సిన తరుణంలో విలియమ్సన్‌ను స్టొయినిస్ ఔట్ చేశాడు. ఆ తర్వాత రషీద్ ఖాన్, శ్రీవత్స్ గోస్వామి (0) వరుసగా ఔట్ కావడంతో హైదరాబాద్ ఓటమి పాలైంది. స్టొయినిస్ (3/26), రబడ (4/29) హైదరాబాద్‌ను దెబ్బ తీశారు. స్టొయినిస్ కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.
ఐపీఎల్లో ఢిల్లీ చరిత్ర
13 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ జట్టు ఫైనల్ చేరడం ఇదే మొట్ట మొదటిసారి. గతంలో ఆ జట్టు నాలుగుసార్లు (2008, 2009-సెమీఫైనల్; 2012, 2019-ప్లే ఆఫ్స్ మూడో స్థానం) ప్రయత్నించి విఫలం చెందింది. ఈ సీజన్లో మాత్రం వరుసగా అగ్ర జట్లను ఓడించి ఎట్టకేలకు ఫైనల్ కు చేరింది.