Begin typing your search above and press return to search.
ఆ కుబేరుల జాబితాలో దావూద్ నెం.2!
By: Tupaki Desk | 13 Sep 2017 4:40 PM GMTప్రపంచ కుబేరుల జాబితాలో బిల్ గేట్స్ - జాక్ మా - జుకర్ బర్గ్ - అంబానీ ఇలా అనేక మంది పేర్లు ప్రముఖంగా వినిపిస్తాయి. వీరంతా తమ తెలివితేటలు - నైపుణ్యాన్ని పెట్టుబడిగా పెట్టి వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ బిలియనీర్లుగా ఎదిగారు. అయితే, భయాన్నే పెట్టుబడిగా పెట్టి కూడా బిలియనీర్లుగా ఎదిగినవారున్నారు. ఆ జాబితాలో ప్రపంచంలోనే రెండో స్థానంలో ముంబై అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ఉన్నాడని ఫోర్బ్స్ పత్రిక వెల్లడించింది. ముంబై అండర్ వరల్డ్ డాన్ - ఇండియాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావూద్ ఇబ్రహీం గురించి తెలియని వారుండరు. భారత్ లో ముంబై బాంబుదాడులకు వ్యూహరచన తో సహా అనేక నేరాలకు పాల్పడ్డ నొటోరియస్ క్రిమినల్ దావూద్. ప్రపంచ వ్యాప్తంగా పేరు మోసిన క్రిమినల్స్ లో ఒకడైన దావూద్ ఆస్తులను కూడబెట్టడంలో కూడా ముందంజలోనే ఉన్నాడు. దావూద్ ను ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఆస్తులు కలిగిన రెండో మాఫియా డాన్ గా ఫోర్బ్స్ పత్రిక పేర్కొంది. బ్రిటన్ లో దావూద్ ఆస్తుల జప్తు నేపథ్యంలో దావూద్ ఆస్తుల గురించిన అనేక విషయాలను వెల్లడించింది. డ్రగ్ మాఫియాలో కొకైన్ కింగ్ గా పిలవబడే ఎస్కోబార్ ఈ ఆస్తుల జాబితాలో మొదటి స్థానంలో ఉన్నట్లు తెలిపింది.
అమెరికాలో వాడుతున్న సుమారు 80శాతం డ్రగ్స్ ఎస్కోబార్ గ్యాంగ్ నుంచే సరఫరా అవుతోంది. దీంతో, అతడి ఆస్తుల విలువ దావూద్ ఆస్తుల విలువ కన్నా ఎక్కువని డైలీ న్యూస్ వెల్లడించింది. 1990ల నాటికే ఎస్కోబార్ 30బిలియన్ డాలర్ల విలువైన సంపదలు కలిగి ఉన్నట్లు పేర్కొంది. దావూద్ కూడా భారీ స్థాయిలో అక్రమ ఆస్తులను కలిగి ఉన్నాడు. అయితే, బ్రిటన్ ప్రభుత్వం దావూద్ ఆస్తులను జప్తు సమయంలో అనేక ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. 2015నాటికి దావూద్ 6.7బిలియన్ డాలర్ల విలువ గల చేసే నికర ఆస్తులు కలిగి ఉన్నట్లు పేర్కొంది. కరాచీలోని క్లిఫ్టన్ ప్రాంతం నుంచి దావూద్ తన క్రైమ్ నెట్ వర్క్ ను రన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దావూద్ పేరుమీద వార్ విక్ షైర్ లో ఓ ఖరీదైన హోటల్ కూడా ఉంది. మిడ్ ల్యాండ్స్ లోనూ అనేక రెసిడెన్స్ ప్రాపర్టీలు ఉన్నాయి. మిడ్ ల్యాండ్స్ లో ఉన్న దావూద్ రెసిడెన్స్ ప్రాపర్టీలపై ప్రస్తుతం బ్రిటన్ ప్రభుత్వం నిఘా పెట్టింది. దావూద్ కు చెందిన కొన్ని ఫైల్స్ ను 2015లో బ్రిటన్ కు భారత్ అందజేసింది. వాటితోనే దావూద్ ఆస్తులను బ్రిటన్ సీజ్ చేసింది. దావూద్ ను అరెస్ట్ కాకుండా కాపాడుతున్న పాకిస్థాన్ కు ఇది ఇబ్బంది కలిగించే విషయమే. దావూద్ ఆస్తుల జప్తుతో భారత్ దౌత్యపరమైన విజయం సాధించినట్లేనని భావిస్తున్నారు.