Begin typing your search above and press return to search.

మాఫియా డాన్ దావూద్ కి పాజిటివ్...క్లారిటీ ఇచ్చిన సోదరుడు అనీస్ ఇబ్రహీం!

By:  Tupaki Desk   |   6 Jun 2020 2:30 PM GMT
మాఫియా డాన్ దావూద్ కి పాజిటివ్...క్లారిటీ ఇచ్చిన సోదరుడు అనీస్ ఇబ్రహీం!
X
అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం మరియు అతని భార్యకి ఈ వైరస్ నిర్దారణ పరీక్షలు చేసినట్లు, ఆ పరీక్షల్లో వారిద్దరికీ వైరస్ పాజిటివ్ వచ్చినట్టు వార్తలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. కొన్ని ఛానెల్స్ లో ఏకంగా ఈ మహమ్మారి కారణంగా అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం చనిపోయారు అని కూడా ప్రచారం చేసారు. అయితే , ఈ వార్తలని దావూద్ ఇబ్రహీం సోదరుడు అనీస్ ఇబ్రహీం తోసిపుచ్చారు.

దావూద్ తో బాటు అతని మొత్తం కుటుంబమంతా ఈ వైరస్ కి గురైనట్టు వఛ్చిన వార్తలను అబద్దం అని ..వారంతా బాగానే ఉన్నారని, తమ నివాసంలో క్షేమంగానే ఉన్నారని అన్నాడు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, దుబాయ్ దేశాల్లో దావూద్ బిజినెస్ వ్యవహారాలు సాగుతున్నాయని తెలిపాడు. దావూద్ ఆధ్వర్యంలోని డీ-కంపెనీ అండర్ వరల్డ్ కార్యకలాపాలను, ఫైనాన్స్ ని అనీసే చూసుకుంటున్నాడు. కాగా 1990 ప్రాంతంలో.. ముంబైలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ నివాసం నుంచి ఆయుధాలతో కూడిన వాహనాన్ని తీసుకువెళ్తూ అనీస్ పట్టుబడినట్టు వార్తలు వఛ్చిన విషయం తెలిసిందే.

బాలీవుడ్ మూవీలకు అతగాడు ఫైనాన్స్ చేస్తాడని, దుబాయ్ లో క్రికెట్ బెట్టింగ్ సిండికేట్ నడుపుతున్నాడనే ఆరోపణలు కూడా అనీస్ పై ఉన్నాయి. ఒకప్పుడు సౌదీ అరేబియాలో పోలీసులకు పట్టుబడినప్పటికీ భారత పోలీసు బృందం నుంచి అనీస్ తప్పించు కున్నాడట.