Begin typing your search above and press return to search.

అప్పును గుర్తు చేసిన వార్నర్‌.. మా కోసం ఆడాలంటూ విజ్ఞప్తి

By:  Tupaki Desk   |   6 Dec 2021 7:23 AM GMT
అప్పును గుర్తు చేసిన వార్నర్‌.. మా కోసం ఆడాలంటూ విజ్ఞప్తి
X
ఆస్ట్రేలియా క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్ మరో సారి సోషల్‌ మీడియాలో సందడి చేశాడు. ఈమద్య కాలంలో వరుసగా ఇండియన్‌ స్టార్స్ ముఖ్యంగా సౌత్‌ స్టార్స్ ను ఇమిటేట్ చేస్తూ.. వారి పాటలకు డాన్స్ చేస్తూ ఆకట్టుకుంటూ ఉన్నాడు. సన్ రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు ఆటగాడిగా ఉన్న నేపథ్యంలో తెలుగు హీరోల్లో పలువురి పాటలకు డాన్స్ లు చేయడంతో పాటు వారి డైలాగ్స్ ను రీల్స్ గా చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు.

ఇప్పుడు కన్నడ స్టార్‌ హీరో దివంగత పునీత్‌ రాజ్ కుమార్ అలియాస్ అప్పు ను ఇమిటేట్ చేశాడు. అప్పు సినిమాలోని ఒక చిన్న షాట్ ను తన ఫేస్‌ మార్పింగ్‌ తో చేసి రీల్ చేశాడు. సోషల్‌ మీడియాలో ప్రస్తుతం ఆ రీల్‌ కాస్త వైరల్‌ అయ్యి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

నెట్టింట వైరల్‌ అవుతున్న అప్పు వార్నర్‌ వీడియో తో కన్నడ ప్రేక్షకులు మరోసారి పునీత్ జ్ఞాపకాల్లోకి వెళ్లారు. డేవిడ్‌ వార్నర్‌ తన రీల్స్ తో అప్పును గుర్తు చేయడంతో అభిమానులు మరోసారి ఎమోషనల్‌ అవుతున్నారు. ఇప్పుడిప్పుడే మరణం నుండి తేరుకుంటున్న అభిమానులు ఆయన లేని లోటు తీర్చలేనిది అంటూ ఆ జ్ఞాపకాల నుండి బయట పడే ప్రయత్నం చేస్తున్నారు.

ఈ సమయంలో డేవిడ్ వార్నర్ ఇలా గుర్తు చేయడంతో అంతా కూడా మరోసారి ఎమోషన్‌ ఫీల్‌ అవుతున్నారు. ఇదే సమయంలో కన్నడ సినీ అభిమానులు మరియు క్రీడాభిమానులు డేవిడ్ వార్నర్‌ కు ఒక రిక్వెస్ట్‌ సోషల్‌ మీడియా ద్వారా పెద్ద ఎత్తున చేస్తున్నారు.

గత సీజన్ లో జరిగిన పరాభవం నేపథ్యంలో ఐపీఎల్‌ లో సన్‌ రైజర్స్ హైదరాబాద్ నుండి డేవిడ్ వార్నర్‌ తప్పుకున్నట్లే అయ్యింది. వచ్చే సీజన్‌ కు గాను డేవిడ్‌ వార్నర్‌ వేలం పాటలో పాల్గొనబోతున్నాడు. ఆ వేలం పాటలో డేవిడ్ వార్నర్‌ ను ఆర్‌సీబీ వారు తీసుకోవాలని కోరుకుంటున్నారు.

డేవిడ్‌ వార్నర్ బెంగళూరు కోసం ఆడేందుకు ఆసక్తి చూపించాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. అందుకు ఆయన ఓకే చెప్తాడా అనేది చూడాలి. గతంలో హైదరాబాద్ కు కప్పు అందించిన ఘనత డేవిడ్ వార్నర్‌ కు ఉంది. అందుకు బెంగళూరుకు కూడా వార్నర్‌ కప్పు అందిస్తాడనే నమ్మకంను అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.