Begin typing your search above and press return to search.

మరోసారి 'ఫ్యాన్స్'ను ఫిదా చేసిన వార్నర్..!

By:  Tupaki Desk   |   29 May 2021 1:30 AM GMT
మరోసారి ఫ్యాన్స్ను ఫిదా చేసిన వార్నర్..!
X
లాక్డౌన్ స‌మ‌యంలో అభిమానులకు, నెటిజన్లకు మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నాడు ప్రముఖ క్రికెటర్ డేవిడ్ వార్న‌ర్. టిక్ టాక్ బాన్ అవ్వకముందే ఈ ఆస్ట్రేలియన్ క్రికెటర్ టిక్ టాక్ వీడియోలు చేయడం మాములే అయిపోయింది. తెలుగు సినిమాలకు సంబంధించిన సాంగ్స్‌, డైలాగ్స్‌తో ఎక్కువ టిక్ టాక్ వీడియోలు చేస్తూ వ‌స్తున్న ఈ ఆస్ట్రేలియా ఓపెనింగ్ బ్యాట్స్ మెన్ డేవిడ్ వార్న‌ర్.. తాజాగా తెలుగు లవ్ డైలాగ్ తో తన భార్యకు ప్రపోస్ చేశాడు. వార్నర్‌ ఆయన భార్య కాండీస్‌ ఎల్లప్పుడూ సోషల్ మీడియాలో యాక్టీవ్ అనే సంగతి తెలిసిందే. సమయం దొరికితే చాలు అలా ఇంస్టాగ్రామ్ రీల్స్ లో వారికీ నచ్చిన పాటలకు చిందస్తుంటారు. ఆ మధ్యలో పాపులర్ తెలుగు సాంగ్ రాములో రాములోకు కాలుకదిపారు. వారి వెనక వార్నర్ గారాలపట్టి ఇండిరే కూడా ఈ వీడియోలో పాల్గొని డాన్స్ చేసింది.

అప్పట్లో ఆ వీడియోస్ హల్చల్ చేసాయి. అలాగే బుట్టబొమ్మ, సన్నజాజి సాంగ్, పోకిరి డైలాగ్‌కి టిక్ టాక్ వీడియోలు సోష‌ల్ మీడియాలో దుమ్మురేపిన సంగతి తెలిసిందే. ఇలా క్రికెటర్లు సైతం తెలుగు పాటల పై, డైలాగ్స్ పై టిక్ టాక్స్ చేయడంతో అభిమానులలో కాస్త ఆసక్తి నెలకొంది. వార్నర్ అయితే మొత్తం సన్ రైసర్స్ జెర్సీ ధరించి ప్రతిసారి అలరిస్తూ.. తనదైన స్టైల్ లో తనకు హైదరాబాద్ పై ఉన్న ప్రేమ, అభిమానాలను బయట పెడుతుంటాడు. ఈ మధ్య ఇంస్టాగ్రామ్ రీల్స్ లో కూడా తెలుగు పాటలకు క్రేజ్ మాములుగా లేదు.

ఇదిలా ఉండగా.. తాజాగా వార్నర్ తన భార్యకు తెలుగులో ఐ లవ్ యూ చెప్పి ఫిదా చేసాడు. ఇంస్టాగ్రామ్ వేదికగా వార్నర్.. తను తన భార్యని రెండు చేతుల్లో ఎత్తుకొని ఉన్నటువంటి అనిమేటెడ్ ఇమేజ్ పోస్ట్ చేసి 'నేను నిన్ను ప్రేమిస్తున్నాను' అంటూ కాప్షన్ జోడించాడు. ఈ పోస్ట్ చూసి తెలుగు ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. అసలు వార్నర్ కు ఇంత తెలుగు ఎలా వస్తుందని షాక్ అవుతున్నారు. కానీ వార్నర్ ఫస్ట్ నుండి తెలుగు భాషపై తన ఇష్టాన్ని చాటుతూనే ఉన్నాడు. ప్రస్తుతం వార్నర్ పోస్ట్ వైరల్ అవుతోంది. అలాగే అభిమానులను ఉద్దేశించి.. "నేను మిమ్మల్ని ఎప్పటికి ప్రేమిస్తాను అభిమానులారా.. మీకు నా మీద ఉండే ప్రేమకు, ఇంకా మీ సహకారానికి ధన్యవాదాలు" అంటూ అభిమానులని ఫిదా చేసాడు. అయితే ప్రస్తుతం వార్నర్ ఫ్యామిలీ పూర్తిగా హైదరాబాద్ కి షిఫ్ట్ అయితే బాగుండు.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.