Begin typing your search above and press return to search.
తండ్రికి ఉరేసి చంపేసిన కూతుళ్ళు... కారణం ఇదే !
By: Tupaki Desk | 12 Aug 2020 10:10 AM GMTమేడ్చల్ జిల్లా జగద్గిరిగుట్ట లో ఓ దారుణ ఘటన జరిగింది. కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న కుతుళ్ల పై మద్యం మత్తులో లైంగిక వేధింపులకు గురిచేయడం తో కూతుళ్లు, ఆ కీచక తండ్రి ఆగడాలు భరించలేక ఉరేసి చంపేశారు. ఈ సంఘటన జగద్గిరిగుట్ట పరిది సీసాల బస్తీలో జరిగింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే .. మేడ్చల్ జిల్లా జగద్గిరిగుట్ట సీసాలబస్తీలో గత కొంతకాలంగా కుటుంబ సభ్యులతో కలిసి మాసాని రాజు అనే వ్యక్తి నివసిస్తున్నాడు. ఇతనికి భార్య, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. ఇతను స్థానికంగా పిండి గిర్నిలో పనిచేస్తుండేవాడు. ఈయన భార్య ఎనిమిది నెలల క్రితం ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. భార్య చనిపోయిన తరువాత , అతడు మద్యానికి పూర్తిగా బానిసగా మారి, తండ్రిని అన్న బుద్ది లేకుండా ఇంట్లో ఉన్న ఇద్దరు కుతుళ్లను లైంగికంగా వేధించడం ప్రారంభించాడు. తాజాగా గత రాత్రి సమయంలో అతిగా మద్యం సేవించి లైంగికంగా వేధించడంతో ఇద్దరు కూతుళ్లు ఆ తండ్రి ఆగడాలని భరించలేక గొంతుకు తాడు బిగించి హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఇద్దరు కూతుర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.