Begin typing your search above and press return to search.
ఆస్తి కోసం తల్లిదండ్రులను చంపిన కూతురు
By: Tupaki Desk | 16 Dec 2020 4:50 AM GMTసమాజంలో బంధాలు.. అనుబంధాలకు విలువ లేకుండా పోతోంది. పచ్చ కాగితాల కోసం ప్రాణాలే తీస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ దారుణం కృష్ణ జిల్లాలో చోటుచేసుకుంది.
కృష్ణ జిల్లా జగ్గయ్యపేట మండలం బండిపాలెంలో ముత్తయ్య-సుగుణమ్మలు జీవిస్తున్నారు. వీళ్లకు మనీషా అనే కూతురు ఉంది. ఈమెకు పెళ్లి చేశారు. భర్త నెమలి బాబూరావు వలంటీర్ గా పనిచేస్తున్నాడు. అందరూ కలిసే ఉంటున్నారు. అయితే మనీషా కొద్దిరోజులగా ఆస్తి అంతా తన పేరు మీద రాయాలని తల్లిదండ్రులతో గొడవలు పెట్టుకుంటోంది. వారు మాత్రం మేం పోయాక నీకే కదా అని అడ్డుచెప్పుతున్నారు.
ఇక తల్లిదండ్రులు ఉన్నంత వరకు తనకు ఆస్తి రాదని డిసైడ్ అయిన కూతురు మనీషా వాళ్లను అంతమొందించాలని ప్లాన్ చేసింది. భర్త బాబూరావుతో కలిసి తల్లిదండ్రుల హత్యకు కుట్ర పన్నింది.
అనుకున్నట్టే నిన్న రాత్రి ముత్తయ్య-సుగుణమ్మను ఇద్దరూ కలిసి చంపేశారు. మనీషా సహకరించగా.. బాబూరావు కత్తితో పొడిచి వారిని చంపేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కూతురు, అల్లుడిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.