Begin typing your search above and press return to search.

పటాయించేందుకు కోర్సులా?

By:  Tupaki Desk   |   23 Sep 2015 11:30 PM GMT
పటాయించేందుకు కోర్సులా?
X
మారుతున్న కాలానికి తగ్గట్లుగా బోధించే విద్యా అంశాలు మారిపోతున్నట్లే కనిపిస్తున్నాయి. శాస్త్ర సాంకేతిక రంగాలతో పాటు.. విభిన్న అంశాలకు సంబంధించి కోర్సులు పెట్టి వారికి శిక్షణ ఇవ్వటం తెలిసిందే. అన్ని విషయాలకు శిక్షణ ఇస్తూ.. డేటింగ్ కు మాత్రం కోర్సు లేకపోతే ఎలా అనుకున్నారో ఏమో కానీ.. చైనాలో ఆ కొరత తీరుస్తూ కొన్ని యూనివర్సిటీలు సరికొత్త కోర్సు షురూ చేశారు.

అమ్మాయితో మాట కలపటం ఎలా? అబ్బాయిని ముగ్గులోకి దింపటం ఎలా? అమ్మాయిలతో స్నేహంగా ఉండటం.. ఆ రిలేషన్ ను డేటింగ్ స్థాయికి ఎలా తీసుకెళ్లాలి? అందుకు సంబంధించిన కిటుకులు.. చేయాల్సినవి.. చేయకూడని అంశాలు ఇలా.. చాలానే అంశాల మీద శాస్త్రీయంగా బోధనలు చేస్తున్నాయి చైనాకు చెందిన కొన్ని విశ్వవిద్యాలయాలు.

ఇందుకు సంబంధించిన కోర్సుల్ని కూడా డిజైన్ చేయటం గమనార్హం. చైనాకు చెందిన తియాంజిన్ అనే విశ్వవిద్యాలయం కాస్త ముందుగా డేటింగ్ కోర్సుకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేసేసింది. రోజుకు గంట చొప్పున మొత్తం 32 క్లాసుల్లో డేటింగ్ కోర్సుని పూర్తి చేస్తారట. చైనా విశ్వవిద్యాలయం వారి వ్యవహారం చూస్తుంటే.. రానున్న రోజుల్లో మరెన్ని కోర్సులకు తెర తీస్తారో..?