Begin typing your search above and press return to search.

డేట్ టార్గెట్ ఇచ్చిన కేసీఆర్

By:  Tupaki Desk   |   13 March 2021 5:49 AM GMT
డేట్ టార్గెట్ ఇచ్చిన కేసీఆర్
X
దేశంలో మరెక్కడా.. మరే రాష్ట్రంలో లేని రీతిలో ఒక హిందూ దేవాలయాన్ని ఒక రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున పనులు చేపట్టి.. భారీ స్థాయిలో పున:ప్రారంభించే దిశగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అడుగులు వేస్తున్నారు. కేసీఆర్ కలల పంటగా చెప్పే యాదాద్రి ఆలయాన్ని నభూతో నభవిష్యతి అన్న రీతిలో సిద్ధం చేస్తున్నారు. రీఓపెనింగ్ ఎప్పుడెప్పుడా? అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న వేళ.. దానికి సంబంధించిన డేట్ టార్గెట్ ను తాజాగా ఇచ్చేశారు కేసీఆర్.

తాజాగా యాదాద్రిపై రివ్యూ నిర్వహించిన ఆయన.. తుదిదశలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు..చేపట్టాల్సిన పనులకు సంబందించిన వివరాల్ని ఆయన చర్చించారు. పనుల పురోగతి ఎంతవరకు వచ్చిందని తెలుసుకున్న ఆయన.. పనుల్ని పూర్తి చేసేందుకు తాజాగా డేట్ టార్గెట్ ఇచ్చేశారు. ఏప్రిల్15 నాటికి యాదాద్రి ఆలయాన్ని సిద్ధం చేయాలని చెప్పారు.ఒక్కసారి పున:ప్రారంభమైతే పెద్ద ఎత్తున భక్తులు రావటం ఖాయమని.. వారికి ఎలాంటి లోటు లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అందుకు తగ్గట్లుగా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

350 అడుగుల పొడవైన క్యూలైన్ నిర్మాణాన్ని ఏప్రిల్ 15 నాటికి పూర్తి చేయాలని.. క్యూలైన్ పొడువునా ప్రాకారం మీద బిగించే కలశపు నమూనాలకు సంబంధించిన నాలుగు డిజైన్లను సీఎంకు చూపించగా.. అందులో ఒకదాన్నిఆయన ఎంపిక చేశారు. బ్రహ్మోత్సవాల్లో సుదర్శన చక్రం తరహాలో శివాలయం చట్టూ త్రిశూలం దర్శనమివ్వాలని.. రథశాలను ఆలయాకృతిలో తీర్చిదిద్దాలని చెప్పారు. రాత్రి వేలలో ఆలయ సముదాయం.. ప్రాంగణం.. పరిసరాలు విద్యుత్ వెలుగుల్ల్లో వెలిగిపోయేలా రూపొందించిన వీడియోకు ఆయన సంతోషం వ్యక్తం చేసినట్లుగా చెబుతున్నారు. మరి.. కేసీఆర్ నోటి నుంచి యాదాద్రి డేట్ వచ్చేయటంతో పనులు మరింత వేగవంతం కానున్నట్లు చెబుతున్నారు.