Begin typing your search above and press return to search.
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పై దాసోజు శ్రవణ్ సంచలన వ్యాఖ్యలు
By: Tupaki Desk | 2 Dec 2020 1:59 AM GMTజీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు కొమ్ము కాసి ఇంత పెద్ద ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ చిల్లర ప్రహాసనంగా మార్చేశారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజ్ శ్రావణ్ ఆరోపించారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ టీఆర్ఎస్ చేతిలో కీలుబొమ్మగా మారిందని మండిపడ్డారు. 10రోజుల్లోనే ఆగమాగంగా ఎన్నికలు నిర్వహించారని ఆడిపోసుకున్నారు. పాతబస్తీలో అసలు పోలింగ్ ఏర్పాట్లే జరగలేదన్నారు. ఓ న్యూస్ చానెల్ చర్చా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
ఎన్నికల కమిషనర్ అయిన ఒక ఐఏఎస్ అధికార పార్టీకి బానిసలా వ్యవహరించడమేంటి? అని దాసోజు శ్రవణ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చాలా చోట్ల బోగస్ ఓట్లను చేర్చారని.. అర్హులైన ఓట్లను తొలగించారని శ్రవణ్ ఆరోపించారు.
ఓటర్ల జాబితా ప్రకటించిన రోజు కూడా టీఆర్ఎస్, ఎంఐఎం మినహా అన్ని రాజకీయ పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేశాయన్నారు. అయినప్పటికీ ఈసీ ఒంటెద్దు పోకడలను అవలంభించిందని విమర్శించారు. దాని పర్యవసానమే చాలా మంది ఉత్సాహవంతులైన యువ ఓటర్ల ఓట్లు గల్లంతయ్యాయని ఆరోపించారు.
జీహెచ్ఎంసీలో తక్కువ పోలింగ్ నమోదు కావడంతో ప్రతిపక్షాలు ఇప్పుడు ఈసీ తీరును తప్పుపడుతున్నాయి. సరైన కసరత్తు లేకుండా చేయడం వల్లే పోలింగ్ పర్సంటేజీ తగ్గిందని నేతలు విమర్శిస్తున్నారు.