Begin typing your search above and press return to search.
ఎవరు హీరో.. ఎవరు జీరో..?
By: Tupaki Desk | 19 Aug 2015 12:20 PM GMTవిషయం ఏదైనా సరే.. సరికొత్త కోణంలో విషయాన్ని చెప్పటంలో సోషల్ మీడియాలోనెటిజన్లకు మించినోళ్లు ఉండరు. కొన్ని కొన్ని అంశాల్లో ప్రజల మైండ్ సెట్ తెలిసేలా కొన్ని వాదనలు బయటకు వస్తుంటాయి. మొన్నా మధ్య గూగుల్ సీఈవో పిచ్చయ్ బాధ్యతలు చేపట్టిన వెంటనే.. సత్యం.. శివం.. సుందరం అంటూ చెలరేగిపోయిన నెటిజన్లు.. ఇప్పుడు ఒక రియల్ స్టోరీ ని తెర పైకి తీసుకొచ్చి.. ఎవరు హీరో...? ఎవరు జీరో అని ప్రశ్నిస్తున్నారు.
ప్రపంచ వింతల్లో ఒకటైన తాజ్ మహాల్ నిర్మించిన మొఘల్ చక్రవర్తి షాజ్ హాన్ ను.. బీహార్ లోని తన భార్య మరణంతో తపస్సు మాదిరి ఒక కొండను ఒంటరిగా తొలచి.. 75 కిలోమీటర్ల దూరాన్ని ఒక కిలోమీటరుకు తగ్గించిన మాంఝీని పోలుస్తూ.. పోస్టింగ్ లు పెట్టం ఇప్పుడు ట్రెండ్ అయ్యింది.
ఉన్నట్లుండి మాంఝీ తెర మీదకు ఎందుకు వచ్చాడంటే.. ఆయన జీవిత కథను మాంఝీ.. ద మౌంటెయిన్ మ్యాన్ అన్న పేరుతో సినిమా తీసి.. ఈ నెల 21న విడుదల చేస్తున్నారు. నవాజుద్దీన్ సిద్దిఖీ.. రాధికా అప్టే ఈ చిత్రంలో నటించారు. ఈ నేపథ్యంలో షాజ్ హాన్.. మాంఝీ ఫోటోలు రెండింటిని పక్కన పెట్టి.. ఎవరు గొప్ప అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఈ సందర్భంగా ఇద్దరిని పోలుస్తూ పలు అంశాల్ని తెరపైకి తెస్తున్నారు.
ముంతాజ్ గురుతుగా తాజ్ ను కట్టించిన షాజ్ హాన్ తనకు తాను ఒళ్లు వంచి పని చేసిందేమీ లేదని.. దాని కోసం 22వేల మంది కూలీలతోపాటు.. వెయ్యి ఏనుగుల్ని ఉపయోగించాడు. దేశవిదేశాల నుంచి తన ప్రేమ మందిరం కోసం పాలరాయి.. విలువైన రత్నాలు తెప్పించాడు. ఇంతా చేస్తే ఒక టూరిస్ట్ స్పాట్ గా తయారైందే తప్ప.. సామాన్యుడికి ఉపయోగపడింది శూన్యం.
కానీ.. మాంఝీ తన భార్యకు అనారోగ్యంగా ఉంటే.. ఆసుపత్రికి తీసుకెళ్లే వసతి లేక ప్రాణాలు కాపాడలేకపోయాడు. అడ్డుగా ఉన్న కొండను తొలిచేందుకు ఒక్కడిగా నడుం బిగించాడు. ఉలి.. సుత్తి.. రెండింటితో సంకల్ప బలంతో.. ఎన్ని కష్టాలు ఎదురైనా వెరవకుండా 22 ఏళ్లు కష్టపడి కొండను తొలిచి రోడ్డుగా మార్చాడు. 75 కిలోమీటర్ల దూరాన్ని ఒక్క కిలోమీటరు దూరంగా మార్చేశాడు. ఎంతోమంది సామాన్యులకు రవాణా సౌకర్యం కల్పించేందుకు సాయంగా నిలిచాడు.
మరి.. వీరిద్దరిలో ఎవరు గొప్ప? మొఘల్ చక్రవర్తి షాజ్ హానా.. లేక.. సామాన్యుడైన మాంఝీనా? అని సూటిగా ప్రశ్నిస్తారు. మరి.. మీ ఓటు ఎవరికి వేస్తారు..?