Begin typing your search above and press return to search.

కుప్పకూలిన ప్రపంచ రాతి నిర్మాణం ..!

By:  Tupaki Desk   |   19 May 2021 9:30 AM GMT
కుప్పకూలిన ప్రపంచ రాతి నిర్మాణం ..!
X
ప్రపంచ ప్రఖ్యాత రాతి నిర్మాణం.. డార్విన్​ ఆర్చ్​ కుప్పకూలింది. ప్రపంచంలోనే ఎన్నో రాతి నిర్మాణాలు ఉండొచ్చు. కానీ గాలాపాగోస్​ ద్వీపంలో సహజసిద్ధంగా ఏర్పడ్డ డార్విన్​ ఆర్చ్​ ఎంతో ప్రత్యేకమైంది. ఎందుకంటే ఇది సహజసిద్ధంగా ఏర్పడింది. ప్రముఖ జీవశాస్త్ర వేత్త డార్విన్​ పేరు ఈ రాతి కట్టడానికి పెట్టారు. అయితే ఈ రాతి కట్టడం ఎలా కూలింది..అనే విషయంపై వివరాలు తెలియరాలేదు. ప్రమాదవశాత్తు ఈ రాతి కట్డడం ధ్వంసం అయి ఉండొచ్చని భావిస్తున్నారు.

ప్రకృతి ప్రేమికులకు ఈ ప్రదేశం ఎంతో ఇష్టమైనది. ఈ రాతి ఆర్చ్ చూసేందుకు ప్రతి ఏడాది ఎంతో మంది పర్యాటకులు దేశ విదేశాల నుంచి వస్తుంటారు. సహజసిద్ధ రాతి నిర్మాణాన్ని చూసి ముగ్దులవుతుంటారు. ఇప్పుడీ సహజ సౌందర్య నిర్మాణం కూలిందని తెలిసిన ప్రకృతి ప్రేమికులు బాధపడుతున్నారు. ఒకప్పుడు ఇది డార్విన్ ద్వీపంలో భాగంగా ఉండేదని సమాచారం.

ప్రపంచ ప్రఖ్యాత వారసత్వ సంపదలో ఈ రాతినిర్మాణాన్ని చేర్చారు. డార్విన్​ ఆర్చ్​ ను యునెస్కో సైతం గుర్తించింది. 19 వ శతాబ్దంలో ద్వీపాల్లోని ఫించ్‌ల అధ్యయనం పరిణామ సిద్ధాంతాన్ని వివరించడానికి జీవశాస్త్రవేత్త చార్లెస్ డార్విన్‌ కు ఈ నిర్మాణం సాయపడిందట. ఈ ఆర్చ్ పరిసర ప్రాంతాలు కూడా ఎంతో ప్రశాంతంగా ఉంటాయి. ఇక్కడ ప్రకృతి ఆహ్లాదభరితంగా ఉంటుంది. దీంతో ఈ ప్రదేశాన్ని చూడటానికి పర్యాటకులు పోటెత్తుతారు. ప్రస్తుతం ఈ రాతి నిర్మాణం కుప్పకూలిపోగా.. రెండు స్తంభాలు మాత్రం మిగిలాయి. వీటికి సంబంధించిన ఫొటోలను అధికారులు విడుదల చేశారు.